
పుణే: ప్రపంచకప్‌లో అమితాసక్తి రేపిన మ్యాచ్‌లలో ఇదొకటి... ఇరు జట్ల తాజా ప్రదర్శన, బలాబలాలు, గత రికార్డులను బట్టి చూస్తే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా పోరు హోరాహోరీగా సాగడం ఖాయమనిపించింది. కానీ చివరకు వచ్చేసరికి అంతా సఫారీల హవానే సాగి ఏకపక్ష విజయం దక్కింది. పేలవ బౌలింగ్‌తో భారీగా పరుగులిచ్చిన కివీస్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ కుప్పకూలింది.
దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయంతో అగ్రస్థానానికి చేరగా... టోర్నీ ఆరంభంలో అద్భుతంగా అనిపించిన న్యూజిలాండ్ ఖాతాలో ఇప్పుడు వరుసగా మూడో ఓటమి చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచిన కివీస్ ఊహించని విధంగా ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది.
ముందుగా దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోరు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డసెన్ (118 బంతుల్లో 133; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), డికాక్ (116 బంతుల్లో 114; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 200 పరుగులు జోడించగా, ఆఖరి 10 ఓవర్లలో సఫారీ జట్టు 119 పరుగులు సాధించింది. డికాక్‌కు ఈ మెగా టోర్నీలో ఇది నాలుగో శతకం. అనంతరం న్యూజిలాండ్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ఫిలిప్స్ (బి) సౌతీ 114; బవుమా (సి) మిచెల్ (బి) బౌల్ట్ 24; డసెన్ (బి) సౌతీ 133; మిల్లర్ (సి) మిచెల్ (బి) నీషమ్ 53; క్లాసెన్ (నాటౌట్) 15; మార్క్‌రమ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–38, 2–238, 3–316, 4–351. బౌలింగ్: బౌల్ట్ 10–1–49–1, హెన్రీ 5.3–0–31–0, సౌతీ 10–0–77–2, సాన్‌ట్నర్ 10–0–58–0, ఫిలిప్స్ 7–0–52–0, రచిన్ 2–0–17–0, నీషమ్ 5.3–0–69–1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) మార్క్‌రమ్ (బి) జాన్సెన్ 2; యంగ్ (సి) డికాక్ (బి) కొయెట్జీ 33; రచిన్ (సి) కొయెట్జీ (బి) జాన్సెన్ 9; మిచెల్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 24; లాథమ్ (సి) మహరాజ్ (బి) రబడ 4; ఫిలిప్స్ (సి) రబడ (బి) కొయెట్జీ 60, సాన్‌ట్నర్ (బి) మహరాజ్ 7; సౌతీ (ఎల్బీ) (బి) జాన్సెన్ 7; నీషమ్ (బి) మహరాజ్ 0; బౌల్ట్ (సి) మిల్లర్ (బి) మహరాజ్ 9; హెన్రీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (35.3 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–8, 2–45, 3–56, 4–67, 5–90, 6–100, 7–109, 8–110, 9–133, 10–167. బౌలింగ్: జాన్సెన్ 8–1–31–3, ఎన్‌గిడి 6–1–28–0, రబడ 6–2–16–1, కొయెట్జీ 6.3–0–41–2, కేశవ్ మహరాజ్ 9–0–46–4.
Comments
Please login to add a commentAdd a comment