అహ్మదాబాద్: డిఫెండింగ్ చాంపియన్, టోర్నీ ఫేవరెట్‌లలో ఒకటైన ఇంగ్లండ్ ప్రపంచకప్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. వరుసగా ఐదో ఓటమితో... మొత్తం 6 పరాజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరో వైపు ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియా ఆరంభ దశలో తడబడినప్పటికీ తర్వాత జూలు విదిల్చింది. క్రమంగా గెలుపుబాట పట్టి ప్రత్యర్థుల ఆట కటిస్తూ సెమీస్‌కు మరింత చేరువైంది.
శనివారం జరిగిన పోరులో ఆసీస్ 33 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా ఆసీస్ 49.3 ఓవర్లలో 286 పరుగుల వద్ద ఆలౌటైంది. లబుషేన్ (83 బంతుల్లో 71; 7 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (52 బంతుల్లో 47; 5 ఫోర్లు), స్మిత్ (52 బంతుల్లో 44; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకే ఆలౌటైంది.
బెన్ స్టోక్స్ (90 బంతుల్లో 64; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మలాన్ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. మొయిన్ అలీ (43 బంతుల్లో 42; 6 ఫోర్లు), వోక్స్ (33 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ఆ్రస్టేలియా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (3/21), స్టార్క్(2/66), హాజల్‌వుడ్ (2/49), కమిన్స్ (2/49) సమష్టిగా ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
టోర్నీ తొలి మ్యాచ్‌లో గత ఫైనలిస్ట్ న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్... తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై మాత్రమే 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా అఫ్గనిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్, ఆ్రస్టేలియాల చేతిలో ఓడింది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో ఆ జట్టు బుధవారం నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.
2015 ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన ఇంగ్లండ్ ఆ జట్టు వన్డేల్లో ఒక్కసారిగా స్వరూపం మార్చుకుంది. భీకర ఆటతో తర్వాతి నాలుగేళ్ల పాటు వన్డే క్రికెట్‌ను శాసించి 2019లో జగజ్జేతగా నిలిచిన టీమ్ ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పతనావస్థకు చేరి మరో సారి 2015కు ముందు రోజులను గుర్తుకు తెచ్చింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) రూట్ (బి) వోక్స్ 11; వార్నర్ (సి) విల్లీ (బి) వోక్స్ 15; స్మిత్ (సి) అలీ (బి) రషీద్ 44; లబుషేన్ (ఎల్బీ) (బి) వుడ్ 71; ఇంగ్లిస్ (సి) అలీ (బి) రషీద్ 3; గ్రీన్ (బి) విల్లీ 47; స్టొయినిస్ (సి) బెయిర్‌స్టో (బి) లివింగ్‌స్టోన్ 35; కమిన్స్ (సి) మలాన్ (బి) వుడ్ 10; స్టార్క్ (సి) అలీ (బి) వోక్స్ 10; జంపా (సి) బట్లర్ (బి) వోక్స్ 29; హాజల్‌వుడ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–11, 2–38, 3–113, 4–117, 5–178, 6–223, 7–241, 8–247, 9–285, 10–286. బౌలింగ్: విల్లీ 10–1–48–1, వోక్స్ 9.3–0–54–4, వుడ్ 10–0–70–2, లివింగ్‌స్టోన్ 6–0–42–1, మొయిన్ అలీ 4–0–28–0, రషీద్ 10–0–38–2.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 0; మలాన్ (సి) హెడ్ (బి) కమిన్స్ 50; రూట్ (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 13; స్టోక్స్ (సి) స్టొయినిస్ (బి) జంపా 64; బట్లర్ (సి) గ్రీన్ (బి) జంపా 1; మొయిన్ అలీ (సి) వార్నర్ (బి) జంపా 42; లివింగ్‌స్టోన్ (సి) సబ్–అబాట్ (బి) కమిన్స్ 2; వోక్స్ (సి) లబుõÙన్ (బి) స్టొయినిస్ 32; విల్లే (సి) జంపా (బి) హాజల్‌వుడ్ 15; రషీద్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్‌వుడ్ 20; వుడ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (48.1 ఓవర్లలో ఆలౌట్) 253. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–103, 4–106, 5–169, 6–174, 7–186, 8–216, 9–253, 10–253. బౌలింగ్: స్టార్క్ 10–0–66–2, హాజల్‌వుడ్ 9.1–1–49–2, కమిన్స్ 10–1–49–2, జంపా 10–0–21–3, హెడ్ 5–0–28–0, స్టొయినిస్ 4–0–34–1.
Comments
Please login to add a commentAdd a comment