మెక్‌గ్రాత్(ఫైల్‌ఫొటో)
సిడ్నీ: క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్.. అయితే ఆ జట్టు ఇప్పటివరకూ ఒక్క వన్డే వరల్డ్ కప్‌ను కూడా అందుకోలేకపోయింది. ఈ మెగా టైటిల్ కోసం 11 సార్లు టోర్నీలు జరగ్గా, మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్ ఏ ఒక్కసారి టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. 1979,1987, 1992 సంవత్సరాల్లో రన్నరప్‌గానే ఇంగ్లిష్ జట్టు సంతృప్తి పడింది.అయితే స్వదేశంలో జరుగనున్న 2019 వన్డే వరల్డ్ కప్‌లో కచ్చితంగా ఇంగ్లండ్ టైటిల్ ఫేవరెట్ అని ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ జోస్యం చెప్పాడు. అందుకు పలుకారణాలు చెప్పిన మెక్‌గ్రాత్.. ఈసారి ఇంగ్లండ్‌ను వరల్డ్ కప్ సాధించకుండా ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశాడు.
ఇటీవల కాలంలో ఇంగ్లండ్ వన్డే క్రికెట్‌ను చూసిన తర్వాతే తాను ఆ జట్టును టైటిల్ ఫేవరెట్‌గా చెబుతున్నానన్నాడు.'గత రెండు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. 22 అంతర్జాతీయ వన్డేలకు గాను 19 విజయాలను ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే మాత్రం ఇంగ్లండ్‌ను ఎవరూ ఆపలేరు. అందులోనూ సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ కావడంతో ఇంగ్లండ్‌ను ఓడించడం చాలా కష్టం' అని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment