ఢిల్లీ: వీరేందర్ సెహ్వాగ్ పరిచయం అవసరం లేని క్రికెటర్. భారత క్రికెట్కు వన్డేలు, టెస్టులలో ఎన్నో మరపురాని విజయాలను అందించిన సెహ్వాగ్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సేహ్వాగ్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. సౌతాఫ్రికా-భారత్ల మధ్య డిసెంబర్ 3 నుండి ఢిల్లీలో జరగనున్న నాల్గవ టెస్ట్ చివరిరోజున సేహ్వాగ్ను తన హోం గ్రౌండ్లో సన్మానించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. భారత క్రికెట్కు సేహ్వాగ్ అందించిన సేవలకు గాను గౌరవంగా ఆయన్ను సన్మానించనుంది.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన భారత ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ను వాంఖడే స్టేడియంలో ఐదో వన్డే సందర్భంగా బీసీసీఐ సన్మానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేహ్వాగ్ హర్యానా తరపున రంజీలో ఆడుతున్నారు. అనంతరం అమెరికాలో జరిగే ఆల్ స్టార్ సిరీస్లో పాల్గొంటారు.