
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోని ఆటతీరు టి20ల్లో మారా లని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి చెప్పాలని వీరూ సూచించాడు. కివీస్‌తో జరిగిన రెండో టి20లో ధోని 37 బంతుల్లో 49 పరుగులు చేసినప్పటికీ అతని సామర్థ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ ‘పొట్టి ఫార్మాట్‌లో ధోని తన పాత్ర ఏంటో తెలుసుకోవాలి. భారీ స్కోర్లు ఛేదించేటపుడు... ధోని తొలి బంతి నుంచే పరుగులు తీయాలి. టి20ల్లోనూ టీమిండియాకు అతని అవసరం ఉంది. ఆటకు ఎప్పుడు టాటా చెప్పాలో అతనికి బాగా తెలుసు. ఏ ఒక్క యువ ప్రతిభావంతుడి అవకాశాల్ని అతను దెబ్బతీయడు’ అని సెహ్వాగ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment