బరిలో ధోని, సెహ్వాగ్ | MS Dhoni, Virender Sehwag to play alongside Shahid Afridi for British Army | Sakshi
Sakshi News home page

బరిలో ధోని, సెహ్వాగ్

Published Thu, Sep 17 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

బరిలో ధోని, సెహ్వాగ్

బరిలో ధోని, సెహ్వాగ్

 నేడు ‘క్రికెట్ ఫర్ హీరోస్’ మ్యాచ్
 లండన్: బ్రిటన్ సైనికుల సంక్షేమార్ధం నిర్వహిస్తున్న ‘క్రికెట్ ఫర్ హీరోస్’ చారిటీ టి20 మ్యాచ్‌కు పలువురు స్టార్ ఆటగాళ్లు ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఓవల్ మైదానంలో నేడు (గురువారం) జరిగే ఈ మ్యాచ్‌లో హెల్ప్ ఫర్ హీరోస్ ఎలెవన్‌తో రెస్టాఫ్ ది వరల్డ్ ఎలెవన్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్రిటన్ తరఫున యుద్ధంలో పోరాడుతూ గాయాల పాలైన సైనికుల చికి త్స, వారి కుటుంబాల సహాయం కోసం అందజేస్తారు. ఆండ్రూ స్ట్రాస్ కెప్టెన్‌గా ఉన్న హీరోస్ ఎలెవన్ జట్టులో ధోనితోపాటు సెహ్వాగ్, గి బ్స్, ఆఫ్రిది తదితరులున్నారు. గోవర్, హో ల్డింగ్ కోచ్, మేనేజర్‌లుగా వ్యవహరిస్తారు. రె స్టాఫ్ వరల్డ్ జట్టు తరఫున బ్రెండన్ మెకల్లమ్, హేడెన్, జయవర్ధనే, గ్రేమ్ స్మిత్, వెటోరి, లారా, సౌతీ బరిలోకి దిగనున్నారు. గ్యారీ కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్న ఈ టీమ్ మేనేజర్‌గా సునీల్ గవాస్కర్ వ్యవహరిస్తుండడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement