వార్న్, గంగూలీలనూ వదల్లేదు..! | Virender Sehwag at his usual witty best to capture Shane Warne, Sourav Ganguly | Sakshi
Sakshi News home page

వార్న్, గంగూలీలనూ వదల్లేదు..!

Published Tue, Jun 6 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

వార్న్, గంగూలీలనూ వదల్లేదు..!

వార్న్, గంగూలీలనూ వదల్లేదు..!

లండన్: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ది సెపరేట్ స్టైల్.  ఏ విషయంలోనైనా తన ముద్ర కచ్చితంగా ఉండాలనే ఆసక్తి సెహ్వాగ్ కు చాలా ఎక్కువ.  ప్రధానంగా హాస్యాన్ని పండించడంలో వీరూకు అతనే సాటి. గత కొంతకాలంగా అతను ట్విట్టర్లో స్పందిస్తున్న తీరే అతని హాస్యానికి అద్దం పడుతుంది. ఇక్కడ అవతలి వ్యక్తులు ఎవరనేది మనోడికి అనవసరం. పాయింట్ దొరికిందంటే చాలు దాన్ని సరికొత్త కోణంలో విశ్లేషించడంలో సెహ్వాగ్ కు అలవాటు. అయితే ఈసారి సెహ్వాగ్ కు క్రికెట్ దిగ్గజాలు షేన్ వార్న్- గంగూలీలు దొరికేశారు.

 

ఆదివారం ఎడ్జ్బాస్టన్ వేదికగా భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో భాగంగా పలుమార్లు వర్షం పడిన క్రమంలో అక్కడ కామెంటేటర్లుగా వ్యవరిస్తున్న గంగూలీ-వార్న్ ఓ కునుకు తీశారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్.. గంగూలీ, వార్న్ నిద్రిస్తున్న ఫోటోలను తీసి ట్విట్టర్ లో పెట్టేశాడు. దానికి తనదైన శైలిలో వ్యాఖ్యలు కూడా జోడించాడు. 'జీవితం అనేది ఎప్పుడూ కలలోనే రూపాంతరం చెందుతుంది. ఈ లెజెండ్లను చూడండి అస్సలు సమయాన్ని వృథా చేయకుండా ఎలా నిద్రపోతున్నారో. అందుకే వారు లెజెండ్స్ అయ్యారు' అంటూ చమత్కరించాడు. దీన్ని చూసిన వార్న్ నవ్వు ఆపులేకపోకపోయాడు. వర్షం బ్రేక్ లోమమ్మల్ని ఇలా ఫోటోలో బంధించి ట్విట్టర్ లో పెడతావా అంటూ వీరూ అంటూ వార్న్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement