సెహ్వాగ్ రికార్డును మిస్సయ్యాడు! | David Warner's Whirlwind Century Not Fast Enough To Beat Virender Sehwag | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్ రికార్డును మిస్సయ్యాడు!

Published Tue, Jan 3 2017 4:07 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

సెహ్వాగ్ రికార్డును మిస్సయ్యాడు!

సెహ్వాగ్ రికార్డును మిస్సయ్యాడు!

సిడ్నీ:పాకిస్తాన్తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పలు రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన వార్నర్.. 40 ఏళ్ల తరువాత  ఓపెనింగ్ సెషన్లోనే ఆ ఘనతను అందుకున్న తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు. ఇదే క్రమంలో 87 ఏళ్ల తరువాత ఆసీస్ తరపున ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్గా నిలిచాడు. ఈ రోజు ఆటలో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వార్నర్ కేవలం 78 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వార్నర్ కెరీర్లో ఇది 18వ టెస్టు సెంచరీ కాగా, పాక్‌పై మూడో సెంచరీ. టెస్టులో తొలిరోజు  లంచ్ సమయానికి ముందే సెంచరీ చేసి ఐదో ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. అంతకుముందు ట్రంపర్(1902), చార్లెస్ మకార్ట్నే(1926), డాన్ బ్రాడ్ మన్(1930), మాజిద్ ఖాన్(1976)లో ఈ ఘనత వహించారు.

 

అయితే భారత విధ్వంసక మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం వార్నర్ దాటలేకపోయాడు. 2006లో వెస్టిండీస్తో సెయింట్ లూసియాలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో సెహ్వాగ్ 25.3 ఓవర్లలో సెంచరీ మార్కును చేరగా, తాజా టెస్టులో వార్నర్ మాత్రం మొదటి ఇన్నింగ్స్ 26.2 ఓవర్లలో శతకం సాధించాడు. ఇన్నింగ్స్ ఓవర్లు పరంగా  సెహ్వాగ్ 'ఫాస్టెస్' రికార్డుకు వార్నర్ ఐదు బంతులు ముందు నిలిచిపోయి మరో ఘనతను సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.

ఈ రోజు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో వార్నర్ లంచ్ సమయానికి సెంచరీ చేస్తే, ఆనాటి విండీస్ తో మ్యాచ్లో సెహ్వాగ్ లంచ్ సమయానికి 99 పరుగులతో అజేయంగా క్రీజ్లో నిలిచాడు. ఇదిలాఉంచితే పాక్ తో మ్యాచ్లో లంచ్ తరువాత వార్నర్(113) అవుటైతే, అప్పటి మ్యాచ్లో సెహ్వాగ్(180) టీ బ్రేక్ తరువాత అవుటయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement