ధోని హెలికాఫ్టర్‌ షాట్‌.. ఎవరు బాగా ఆడారంటే... | experts try to pull off helicopter shots like dhoni | Sakshi
Sakshi News home page

ధోని హెలికాఫ్టర్‌ షాట్‌.. ఎవరు బాగా ఆడారంటే...

Published Mon, Oct 9 2017 4:45 PM | Last Updated on Mon, Oct 9 2017 6:59 PM

experts try to pull off helicopter shots like dhoni

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది హెలికాఫ్టర్‌ షాట్‌. ఈ షాట్‌ని క్రికెట్‌కు పరిచయం చేసింది ధోనియేనని వేరే చెప్పక్కర్లేదు. దోని తన బ్యాట్‌ను అచ్చం హెలికాఫ్టర్‌లాగే తిప్పుతూ బాల్‌ని బౌండరీ దాటించి మొదట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే ఈ షాట్‌ ఆడటానికి చాలా మంది ప్రయత్నించిన ఎవరికీ సాధ్యం కాలేదు. 

కాగా శనివారం రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 అనంతరం కామెంటర్లు ధోని హెలికాఫ్టర్‌ షాట్‌ని చాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ చాలెంజ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతోపాటు.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు డీన్‌ జోన్స్‌, బ్రెట్‌ లీలు పాల్గొని ధోనిని అనుకరించే ప్రయత్నం చేశారు.  ఈ నలుగురు ధోనిలాగే షాట్‌ ఆడేందుకు ప్రయత్నించారు. కాగా వీరందరితో పోలిస్తే కాస్త వీరేంద్ర సెహ్వాగ్‌ హెలికాఫ్టర్‌ షాట్‌ బాగా కొట్టాడు. ధోని స్వస్థలం రాంచీలోనే ఈ ప్రయోగం చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోని స్టార్‌ స్సోర్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement