లక్ష్మణ్‌ ఓటు పంత్‌కే.. ధోనికి కాదు! | Laxman Names His Team India Squad For World T20 | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ ఓటు పంత్‌కే.. ధోనికి కాదు!

Published Thu, Jan 9 2020 11:47 AM | Last Updated on Thu, Jan 9 2020 12:18 PM

Laxman Names His Team India Squad For World T20 - Sakshi

న్యూఢిల్లీ: మొన్నటి వరకూ తమ దశాబ్దపు అత్యుత్తమ జట్లను మాజీలు ఎంపిక చేస్తే, ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్లను ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా  తన టీమిండియా టీ20 వరల్డ్‌ప్‌ జట్టును మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రకటించాడు. ఇందులో ఎంఎస్‌ ధోనికి చోటు ఇవ్వలేదు లక్ష్మణ్‌. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌ పంత్‌కే ఓటేసిన లక్ష్మణ్‌.. ధోనిని పక్కన పెట్టాడు. రాబోవు  టీ20  వరల్డ్‌కప్‌ నాటికి ధోని ఆడతాడా.. లేదా అనే సందిగ్థంలో ఉండగా లక్ష్మణ్‌ తన జట్టు ఇదేనంటూ ప్రకటించాడు. ఈ తన జట్టులో ఓపెనర్‌గా శిఖర్‌ ధావన్‌ను కూడా లక్ష్మణ్‌ ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇక్కడ రోహిత్‌ శర్మకు జతగా ఓపెనింగ్‌ బాధ్యతలను కేఎల్‌ రాహుల్‌కు ఇచ్చాడు. దాంతో ధావన్‌ను పక్కనపెట్టాడు. ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును లక్ష్మణ్‌ ప్రకటించాడు. (ఇక్కడ చదవండి: ‘నేనైతే ధావన్‌ను ఎంపిక చేయను)

లక్ష్మణ్‌ వరల్డ్‌టీ20 టీమిండియా జట్టు ఇదే..
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మనీష్‌ పాండే, శివం దూబే,  రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement