సెహ్వాగ్తో ధోని ఇలా..! | MS Dhoni walks down memory lane to relive school days | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్తో ధోని ఇలా..!

Published Sat, Feb 4 2017 11:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

సెహ్వాగ్తో ధోని ఇలా..!

సెహ్వాగ్తో ధోని ఇలా..!

బజ్జార్(హరియాణా):టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో విభేదాల కారణంగానే తన క్రికెట్ కెరీర్కు వీరేంద్ర సెహ్వాగ్ బలవంతంగా వీడ్కోలు చెప్పాడనేది గతంలో వినిపించిన మాట. అయితే తాజాగా తమ మధ్య అలాంటిది ఏమీ లేదనే సంకేతాలు పంపారు వీరిద్దరూ. దీనిలో భాగంగా శుక్రవారం వీరిద్దరూ కలిసిన ఒక ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కూడా.

ఇంతకీ అసలు విషయమేమిటంటే..హర్యానాలోని బజ్జార్లో ఉన్న సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ని ధోని సందర్శించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చావేదికలో విద్యార్థులతో కలిసి ఆనాటి తన స్కూల్ డేస్ జ్ఞాపకాల్ని ధోని పంచుకున్నాడు. 'మనం చక్కగా చదువుకోవడానికి, ఆటలతో ఎంజాయ్ చేయడానికి స్కూల్ అనేది ఒక చక్కటి వేదిక. ఇక్కడ టీచర్లదే కీలక పాత్ర. నా జీవితంలో స్కూల్ లైఫ్ అనేది అద్భుతంగా సాగింది. అదే నా జీవితంలో అత్యుత్తమ పిరియడ్. బాల్యం చాలా అందంగా ఉంటుంది. ఎటువంటి ఒత్తిడి మనమీద ఉండదు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఒత్తిడి అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రతీ ఒక్కరూ పరుగుల జీవితానికి అలవాటు పడిపోయారు. స్కూల్ లైఫ్లో అటువంటి ఉండదు. కావాల్సినంతం ఆనందం.. అందం ఉంటుంది. బాల్యాన్ని చక్కగా ఆస్వాదించడండి' అని ధోని తన అనుభవాల్ని విద్యార్థులతో పంచుకున్నాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement