India lost it in their minds when they decided to exclude Ashwin: Virender Sehwag - Sakshi
Sakshi News home page

WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. ఇలా అయితే చాలా కష్టం: సెహ్వాగ్

Published Mon, Jun 12 2023 10:43 AM | Last Updated on Mon, Jun 12 2023 11:04 AM

India lost it in their minds when they decided to exclude Ashwin: Sehwag - Sakshi

ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పేలవ ప్రదర్శన కరబరిచిన భారత జట్టు ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. టీమిండియా కనీస పోటీ కూడా ఇవ్వకుండా టైటిల్‌ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది.

ఇక ఈ కీలక మ్యాచ్‌కు రవిచంద్రన్‌ అశ్విన్‌ పక్కన పెట్టిన భారత జట్టు మెనెజ్‌మెంట్‌పై మొదటి రోజు నుంచే విమర్శల  వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని టీమిండియా ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తవించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పిదాలను సెహ్వాగ్ ఎత్తి చూపాడు.

"డబ్ల్యూటీసీ విజేతగా నిలిచినందుకు ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు చాంపియన్స్‌గా నిలవడానికి అర్హులు. అయితే ఆసీస్‌ జట్టులో ఎడమచేతి బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అశ్విన్‌ జట్టులో ఉండాల్సింది. అతడు లెఫ్ట్‌హ్యండర్స్‌కు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగలడు. ఎప్పుడైతే అశ్విన్‌ను పక్కన పెట్టి జట్టు మెనెజ్‌మెంట్‌ పెద్ద తప్పుచేసింది.

అది వాళ్ల ఓటమికి ఒక కారణం. అదేవిధంగా భారత టాపర్డర్‌ కూడా చాలా నిరాశపరిచింది. వారు కాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేయాల్సింది. ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవాలంటే ఇటువంటి ఆటతీరు పనికిరాదు. ఇంకా బెటర్‌ మైండ్‌ సెట్‌తో ముందుకు పోవాలని" ట్విటర్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండిWorld Cup 2023: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. ఉప్పల్‌లో నో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌! పాక్‌- భారత్‌ మ్యాచ్‌ అక్కడే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement