India-Australia test
-
భారత్ లక్ష్యం..294
-
కోహ్లీ హోల్డర్, స్మిత్ ట్యూబ్‌లైట్ ..సెహ్వాగ్ ట్వీట్
ఢిల్లీ: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్ శైలితో అభిమానులు అలరించేవాడు. అంతార్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం వీరు తన వ్యంగ్యమైన ట్వీట్లతో క్రికెట్ అభిమానులును అలరిస్తున్నాడు. గత కొద్ది కాలంగా ప్రతి విషయంపై వ్యంగ్యమైన ట్వీట్లతో స్సందించిన వీరు. తాజాగా ధర్మశాల టెస్టులో భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిడంతో టీంఇండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సీరీస్‌లో ప్రతిభ చూపించిన క్రికెటర్లకు తన ఇంట్లో వాడే వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. భారత కెప్టెన్ కోహ్లీకి హోల్డర్, టీం సభ్యులు ఉమేశ్ యాదవ్‌కు పట్టుకారు( సాన్సీ) అశ్విన్, రహనేలకు డిసర్ట్ కూలర్, కుల్దీప్కు ఎగ్జాస్ట్ ఫ్యాన్, పుజారాకు ఇన్వర్టర్, జడేజాకు నీటి పంపు మోటారు (టుల్లు పంపు), రాహుల్‌కు స్టెబ్లైజర్ వస్తువులను అవార్డులుగా ప్రకటించాడు. వీరు తన ఇంటి అవార్డులను ఆసీస్ ఆటగాళ్లకు సైతం కేటాయించాడు. సీరీస్‌లో సెంచరీలతో చెలరేగి 499 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ట్యూబ్‌లైట్, రాంచీ టెస్టు డ్రాగా మార్చిన ఆసీస్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్కోంబ్కు దువ్వెన (జూన్ కంగీ), అవార్డులు దక్కాయి. Congratulations Bharat on a wonderful season. Only Chuna in Puna. Great effort @anilkumble1074 in ensuring no complacency. — Virender Sehwag (@virendersehwag) 28 March 2017 -
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు కోహ్లీ దూరమా?
ధర్మశాల: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్రిల్ 5న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ నాల్గో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. ధర్మశాల టెస్టుకు ముందు 100 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతానన్న కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్ విఫలమవడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. నాల్గో టెస్టులో ఆస్ట్రేలియాపై 8 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ గాయం చిన్నదనుకున్నానని కానీ పెద్దగా ప్రభావం చూపిందని తెలిపాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంక కోన్ని వారాల సమయం పడుతుందన్నాడు. 100 శాతం ఫిట్ అయిన తర్వాతే ఐపీఎల్లో ఆడతానని పేర్కొన్నాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఆడటం సందేహంగా మారింది. గత ఐపీఎల్లో కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేసి రాయల్‌చాలెంజర్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గత ఫైనల్లో తలపడ్డ రాయల్‌చాలెంజర్స్, సన్‌రైజర్స్ జట్లు ఐపీఎల్-2017 ప్రారంభ మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఆడనున్నాయి. ఇప్పటికే రాయల్‌చాలెంజర్స్ మూడు సార్లు ఫైనల్లో తలపడి టైటిల్ అందుకోలేక పోయింది. కోహ్లీ గాయం రాయల్ చాలెంజర్స్ జట్టును కలవరపెడుతుంది. కోహ్లీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని, ఐపీఎల్లో అతని బ్యాటింగ్‌తో దూకుడు కొనసాగించాలిని అభిమానులు కోరుకుంటున్నారు. -
ప్రపంచంలోనే విరాట్ చాలా ఖరీదైన..
-
ప్రపంచంలోనే విరాట్ చాలా ఖరీదైన..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో కీలక నాలుగో టెస్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరం కావడం అభిమానులకు బాధించి ఉండొచ్చు. కాగా ఈ మ్యాచ్ తొలి రోజు శనివారం విరాట్ అభిమానులను, తోటి ఆటగాళ్ల మనసు గెల్చుకున్నాడు. ధర్మశాలలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షార్ట్ బ్రేక్ సందర్భంగా కోహ్లీ మైదానంలో ప్రత్యక్షమయ్యాడు. సహచర ఆటగాళ్ల కోసం అతను డ్రింక్స్ తీసుకుని వచ్చాడు. కోహ్లీ ఇలా వాటర్ బాయ్ అవతారమెత్తేసరికి భారత ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లు మ్యాచ్ సమయంలో సహచర ఆటగాళ్ల కోసం వాటర్ బాటిల్స్ తీసుకుని వస్తుంటారు. కెప్టెన్ లేదా కీలక ఆటగాళ్లు ఇలా తీసుకురావడం అరుదు. మైదానంలో కోహ్లీ కనిపించగానే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా గంటలోనే భారీ స్పందన వచ్చింది. విరాట్‌ను ప్రశంసిస్తూ నెటిజెన్లు కామెంట్లు చేశారు. మాజీ క్రికెటర్, కామెంటేటర్ బ్రెట్ లీ మాట్లాడుతూ.. ప్రపంచంలో కోహ్లీ చాలా ఖరీదైన డ్రింక్స్ బాయ్ అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. భారత ఆటగాళ్లు కోసం ఎవరు మంచి నీళ్లు తీసుకుని వచ్చారో చూడండి.. 12వ ఆటగాడు విరాట్ కోహ్లీ అని కామెంట్ చేశాడు. -
ధోనీ.. నిన్ను మిస్సయ్యాం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని జేఎస్సీఏ స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈ వేదికలోనే జరగనుంది. అయితే రాంచీవాసులు ఎంతో అభిమానించే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటను ఈ మ్యాచ్‌లో చూసే అవకాశం లేకుండాపోయింది. ప్రపంచ క్రికెట్లో రాంచీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ధోనీ బ్యాటింగ్‌ను సొంతగడ్డపై ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ లేకపోవడాన్ని లోటుగా భావిస్తున్నారు. ధోనీ స్వస్థలం రాంచీయే. అతను ఇక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుని ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎదిగాడు. స్కూలు రోజుల్లో ధోనీ మొదట ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ తర్వాతే క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఏదో ఒకరోజు రిటైరవ్వాల్సిందేనని, ధోనీ అకస్మాత్తుగా టెస్టు క్రికెట్ నుంచి వైదొలగడంతో అభిమానులు బాధపడ్డారని, సొంతగడ్డపై జరిగే తొలి టెస్టులో అతను ఆడకపోవడం ఒకింత బాధగా ఉందని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ అన్నాడు. రాంచీలో జరిగిన తొలి టి-20, వన్డే మ్యాచ్‌లలో ధోనీ టీమిండియాకు సారథ్యం వహించాడు. అయితే టెస్టు మ్యాచ్ కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. ధోనీ మరో కోచ్ చంచల్ భట్టాచార్య మాట్లాడుతూ.. 'రాంచీలో టెస్టు మ్యాచ్ జరుగుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ఊహించని కల సాకారమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రాంచీ ముద్దుబిడ్డ ధోనీ ఆడటం లేదు. ఈ మ్యాచ్‌లో మహీ ఆడకపోవడం రాంచీకే కాదు జార్ఖండ్ వాసులందరికీ వెలితిగా ఉంది. బాధగానే ఉన్నా టెస్టుల నుంచి రిటైరవ్వాలని ధోనీ నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ ఆడకపోయినా ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తారని ఆశిస్తున్నా' అని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ధోనీ కుటుంబ సభ్యులను నిర్వాహకులు ఆహ్వానించారు. -
మార్ష్ స్థానంలో మాక్స్వెల్..
రాంచీ: ఆస్ట్రేలియా జట్టులో భుజం గాయం కారణంగా దూరమైన మిచెల్ మార్ష్ స్థానానికి ఇద్దరు ఆటగాళ్లు పోటిపడుతున్నారు. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్లో విక్టోరియా జట్టుకు చెందిన మార్కస్ స్టోయినిస్, గ్లేన్ మాక్స్వెల్ల్లో ఒకరు ఎంపిక అవనున్నారు. ఈ స్థానం కోసం ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టిపోటి నెలకొంది. వీరిద్దరిలో ఒకరు రాంచీలో గురువారం నుంచి జరిగే టెస్టులో పాల్గొనే అవకాశం ఉంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇరుజట్ల మద్య పోటి రసవత్తరంగా మారడంతో ఈ ఎంపికకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జట్టులో స్టార్ ఆటగాళ్లు స్టార్క్, మార్ష్ దూరమవడంతో జట్టు బలహీనమైంది. పుణేలో ఓడిన భారత్, బెంగళూరులో ప్రతీకారం తీసుకోని దూకుడుగా ఉంది. సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. అయితే మాక్స్వెల్ చేరికతో జట్టుకు లాభం చేకూరనుంది. మార్కస్ కూడా మార్ష్ లేని లోటు తీర్చుతూ బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబర్చగలడు. అయితే కొద్ది రోజులుగా మాక్స్వెల్ ఫాంలో లేకపోవడం ఆసీస్‌ను కలవరపెడుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే పరిమితమైన మార్కస్ ఇప్పటి వరకు టెస్టులు ఆడలేదు. 3 వన్డేలు, ఒక టీ20 మినహా అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేదు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆసీస్ బోర్డు తర్జన భర్జన పడుతుంది.