ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు కోహ్లీ దూరమా?
ధర్మశాల: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్రిల్ 5న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ నాల్గో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. ధర్మశాల టెస్టుకు ముందు 100 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతానన్న కోహ్లీ ఫిట్‌నెస్ టెస్ట్ విఫలమవడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. నాల్గో టెస్టులో ఆస్ట్రేలియాపై 8 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ గాయం చిన్నదనుకున్నానని కానీ పెద్దగా ప్రభావం చూపిందని తెలిపాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంక కోన్ని వారాల సమయం పడుతుందన్నాడు.
100 శాతం ఫిట్ అయిన తర్వాతే ఐపీఎల్‌లో ఆడతానని పేర్కొన్నాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఆడటం సందేహంగా మారింది. గత ఐపీఎల్‌లో కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేసి రాయల్‌చాలెంజర్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గత ఫైనల్లో తలపడ్డ రాయల్‌చాలెంజర్స్, సన్‌రైజర్స్ జట్లు ఐపీఎల్-2017 ప్రారంభ మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఆడనున్నాయి. ఇప్పటికే రాయల్‌చాలెంజర్స్ మూడు సార్లు ఫైనల్లో తలపడి టైటిల్ అందుకోలేక పోయింది. కోహ్లీ గాయం రాయల్ చాలెంజర్స్ జట్టును కలవరపెడుతుంది. కోహ్లీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని, ఐపీఎల్‌లో అతని బ్యాటింగ్‌తో దూకుడు కొనసాగించాలిని అభిమానులు కోరుకుంటున్నారు.