Royalchalengers Bangalore
-
చరిత్ర సృష్టించిన పూరన్.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ! వీడియో వైరల్
ఐపీఎల్లో-2023లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మెరుపు బ్యాటింగ్ సూపర్ జెయింట్స్ శిబిరంలో కాస్త ఆశలు రేపింది. అయితే స్టోయినిష్ ఔటయ్యక ఇక లక్నో గెలుపు కష్టమని భావించారు. పూరన్ విధ్వంసం ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2023లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా యూసప్ పఠాన్, సునీల్ నరైన్‌తో కలిసి నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కేల్ రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్ 4 ఫోర్లు, 7 సిక్స్‌లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఇక విజయానికి దగ్గరలో పూరన్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఆయుష్ బదోని సమయస్పూర్తిగా ఆడుతూ.. మ్యాచ్‌ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తూ బదోని 19 ఓవర్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో లక్నో శిబిరంలో ఉత్కంఠ మొదలైంది. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి. బంతిని డుప్లెసిస్.. హర్షల్ పటేల్ చేతికి ఇచ్చాడు. క్రీజులో ఉనద్కట్, వుడ్ ఉన్నారు. తొలి బంతికి ఉనద్కట్ సింగిల్ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో లక్నో విజయ సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆర్సీబీ, లక్నో డగౌట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది. చదవండి: RCB VS LSG: 2023 ఐపీఎల్లో అత్యంత భారీ సిక్సర్.. కొడితే స్టేడియం దాటి బయట పడింది.. 𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV — JioCinema (@JioCinema) April 10, 2023 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win! A roller-coaster of emotions in Bengaluru 🔥🔥 Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్సీబీ.. విజయం ఎవరిది..?
ఐపీఎల్-2022లో భాగంగా శనివారం బ్రబౌర్న్ వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ మధ్యహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఏడాది సీజన్లో వరుస విజయాలుతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీను చిత్తు చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. కాగా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుకు కాస్త ఇబ్బంది పెట్టే విషయం. మరో వైపు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. మిడిలార్డర్లో మిల్లర్, తెవాటియా వంటి హిట్టర్లు ఉన్నారు. అఖరిలో రషీద్ ఖాన్ కూడా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ఇక వరుస రెండు ఓటములతో డీలా పడ్డ ఆర్సీబీ.. గుజరాత్‌పై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఆర్సీబీ బౌలింగ్ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో కాస్త తడబడుతోంది. విరాట్ కోహ్లి ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. పిచ్ రిపోర్ట్ ఈ గ్రౌండ్లో ఆర్సీబీ కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. ఈ పిచ్ బౌలర్లకు అనుకులిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. తుది జట్లు అంచనా గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ చదవండి: PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే! -
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌కు కోహ్లీ దూరమా?
ధర్మశాల: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్రిల్ 5న ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ రాంచీ టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ కోహ్లీ నాల్గో టెస్టులో డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. ధర్మశాల టెస్టుకు ముందు 100 శాతం ఫిట్‌గా ఉంటేనే ఆడతానన్న కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్ విఫలమవడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. నాల్గో టెస్టులో ఆస్ట్రేలియాపై 8 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ గాయం చిన్నదనుకున్నానని కానీ పెద్దగా ప్రభావం చూపిందని తెలిపాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంక కోన్ని వారాల సమయం పడుతుందన్నాడు. 100 శాతం ఫిట్ అయిన తర్వాతే ఐపీఎల్లో ఆడతానని పేర్కొన్నాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ఆడటం సందేహంగా మారింది. గత ఐపీఎల్లో కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ చేసి రాయల్‌చాలెంజర్స్ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. గత ఫైనల్లో తలపడ్డ రాయల్‌చాలెంజర్స్, సన్‌రైజర్స్ జట్లు ఐపీఎల్-2017 ప్రారంభ మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఆడనున్నాయి. ఇప్పటికే రాయల్‌చాలెంజర్స్ మూడు సార్లు ఫైనల్లో తలపడి టైటిల్ అందుకోలేక పోయింది. కోహ్లీ గాయం రాయల్ చాలెంజర్స్ జట్టును కలవరపెడుతుంది. కోహ్లీ గాయం నుంచి పూర్తిగా కోలుకోని, ఐపీఎల్లో అతని బ్యాటింగ్‌తో దూకుడు కొనసాగించాలిని అభిమానులు కోరుకుంటున్నారు.