Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా శనివారం బ్రబౌర్న్ వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్ మధ్యహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలుతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్.. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీను చిత్తు చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది.
కాగా ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టుకు కాస్త ఇబ్బంది పెట్టే విషయం. మరో వైపు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. మిడిలార్డర్‌లో మిల్లర్, తెవాటియా వంటి హిట్టర్లు ఉన్నారు. అఖరిలో రషీద్ ఖాన్ కూడా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్ వంటి స్టార్ బౌలర్లు ఉన్నారు. ఇక వరుస రెండు ఓటములతో డీలా పడ్డ ఆర్‌సీబీ.. గుజరాత్‌పై విజయం సాధించి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఆర్‌సీబీ బౌలింగ్ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో కాస్త తడబడుతోంది. విరాట్ కోహ్లి ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది.
పిచ్ రిపోర్ట్
ఈ గ్రౌండ్‌లో ఆర్‌సీబీ కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. ఈ పిచ్ బౌలర్లకు అనుకులిస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
తుది జట్లు అంచనా
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, రజత్ పటీదార్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్
చదవండి: PBKS Vs LSG: చెత్తగా ఆడారు.. టీమ్‌ను అమ్మిపారేయండి.. అప్పుడే!
Comments
Please login to add a commentAdd a comment