PC: IPL.com
ఐపీఎల్‌లో-2023లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఆరంభంలో తడబడింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్టోయినిష్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మెరుపు బ్యాటింగ్ సూపర్ జెయింట్స్ శిబిరంలో కాస్త ఆశలు రేపింది. అయితే స్టోయినిష్ ఔటయ్యక ఇక లక్నో గెలుపు కష్టమని భావించారు.
పూరన్ విధ్వంసం
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2023లో అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా యూసప్ పఠాన్, సునీల్ నరైన్‌తో కలిసి నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కేల్ రాహుల్, ప్యాట్ కమ్మిన్స్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్ 4 ఫోర్లు, 7 సిక్స్‌లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఇక విజయానికి దగ్గరలో పూరన్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది. అయితే మరో ఎండ్‌లో ఉన్న ఆయుష్ బదోని సమయస్పూర్తిగా ఆడుతూ.. మ్యాచ్‌ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాడు. అయితే దురదృష్టవశాత్తూ బదోని 19 ఓవర్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
దీంతో లక్నో శిబిరంలో ఉత్కంఠ మొదలైంది. ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి. బంతిని డుప్లెసిస్.. హర్షల్ పటేల్ చేతికి ఇచ్చాడు. క్రీజులో ఉనద్కట్, వుడ్ ఉన్నారు. తొలి బంతికి ఉనద్కట్ సింగిల్ తీశాడు. అనంతరం రెండో బంతికి వుడ్ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు.
దీంతో లక్నో విజయ సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులుగా మారింది. నాలుగో బంతికి బిష్ణోయ్ సింగిల్ తీసి ఉనద్కట్ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో స్కోర్లు సమానం అయ్యాయి. అయితే ఐదో బంతికి ఉనద్కట్ పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఆర్సీబీ, లక్నో డగౌట్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఒక్క వికెట్ తేడాతో లక్నో విజయం సాధించింది.
చదవండి: RCB VS LSG: 2023 ఐపీఎల్‌లో అత్యంత భారీ సిక్సర్.. కొడితే స్టేడియం దాటి బయట పడింది..
𝙏𝙝𝙚 𝘾𝙡𝙖𝙨𝙨 𝙤𝙛 𝙋𝙤𝙤𝙧𝙖𝙣 🥵@LucknowIPL's swashbuckling batter scores the fastest #TATAIPL2023 5️⃣0️⃣ 💥 #RCBvLSG #JioCinema #IPLonJioCinema pic.twitter.com/w62ZhrkROV
— JioCinema (@JioCinema) April 10, 2023
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗚𝗔𝗠𝗘 🤯🤯🤯@LucknowIPL pull off a last-ball win!
— IndianPremierLeague (@IPL) April 10, 2023
A roller-coaster of emotions in Bengaluru 🔥🔥
Follow the match ▶️ https://t.co/76LlGgKZaq#TATAIPL | #RCBvLSG pic.twitter.com/96XwaYaOqT
Comments
Please login to add a commentAdd a comment