ఆస్ట్రేలియా అధమ స్థాయికి...
► రెండో టెస్టులోనూ ఘోర పరాభవం
► ఇన్నింగ్స్ 80 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం
► 2-0తో టెస్టు సిరీస్ సొంతం
హోబర్ట్: దశాబ్దాలపాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా ఇప్పుడు పరాజయాలను అలవాటుగా మార్చుకుంది. పాతతరం వెస్టిండీస్‌ను గుర్తుకు తెచ్చేలా అద్భుతమైన జట్టు నుంచి మ్యాచ్ మ్యాచ్‌కూ దిగజారుతున్న ఆటతో పరాభవానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది! సొంతగడ్డపై కూడా కనీస స్థారుు ప్రదర్శనను ఇవ్వలేక కంగారూలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టెస్టు సిరీస్‌ను ప్రత్యర్థి దక్షిణాఫ్రికాకు అప్పగించేశారు. ఈ క్రమంలో ఒకదాన్ని మించి మరో చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మంగళవారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ అవమానకర రీతిలో ఇన్నింగ్స్, 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 121/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 161 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు 32 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోవడం విశేషం.
ఉస్మాన్ ఖాజా (64) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ స్మిత్ (31) జట్టును రక్షించేందుకు విఫల ప్రయత్నం చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లలో ఒక్కరూ నిలవలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కైల్ అబాట్ (6/77), రబడ (4/34) ఆసీస్‌ను కుప్పకూల్చారు. రెండో రోజు ఆట రద్దును మినహారుుస్తే కేవలం రెండున్నర రోజుల్లోనే ఆసీస్ కథ ముగిసిపోరుునట్లరుుంది. సఫారీ పేసర్ల సీమ్, స్వింగ్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆఖరి రోజు ఆసీస్ 24.1 ఓవర్లు మాత్రమే ఆడి చేతులెత్తేసింది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కూడా ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. మూడో టెస్టు ఈ నెల 24 నుంచి అడిలైడ్‌లో జరుగుతుంది.
ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక చేతిలో 0-3తో ఓడిన ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా మూడో సిరీస్ (2008-09, 2012-13)ను గెలుచుకోగా, ఆస్ట్రేలియాలో సఫారీలు తొలిసారి ఇన్నింగ్స్ తేడాతో టెస్టు నెగ్గడం విశేషం. ఆస్ట్రేలియా సొంతగడ్డపై 88 ఏళ్ల తర్వాత మ్యాచ్‌లో ఇంత తక్కువ బంతులకే (93 ఓవర్లు) ఓటమిపాలు కాగా, రెండు ఇన్నింగ్‌సలు కలిపి 16 మంది ఒకే అంకె స్కోరుకే పరిమితం కావడం 104 ఏళ్లలో మొదటిసారి కావడం ఆ జట్టు ఆటతీరుకు నిదర్శనం.