ఆస్ట్రేలియా వైట్‌వాష్
5-0తో సిరీస్ నెగ్గిన దక్షిణాఫ్రికా
వార్నర్ పోరాటం వృథా
కేప్‌టౌన్: ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా జట్టుకు ఘోర పరాభవం. తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐదు వన్డేల సిరీస్‌ను ఈ జట్టు 0-5తో క్లీన్ స్వీప్ అరుు్యంది. సొంత గడ్డపై సమష్టి ఆటతీరుతో దుమ్ము రేపిన దక్షిణాఫ్రికా.. ఆసీస్‌ను అన్ని మ్యాచ్‌ల్లోనూ చావుదెబ్బ తీసింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో 31 పరుగుల తేడాతో ప్రొటీస్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్‌సలో ఆసీస్‌కన్నా దక్షిణాఫ్రికా కేవలం రెండు పారుుంట్ల తేడాతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 327 పరుగులు సాధించింది. రోసౌ (118 బంతుల్లో 122; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి తోడు డుమిని (75 బంతుల్లో 73; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు.
52 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో ఈ జంట నాలుగో వికెట్‌కు 178 పరుగులు జోడించింది. ట్రెమెన్, మెన్నీలకు మూడేసి వికెట్లు దక్కారుు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 48.2 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌట్ అరుు్యంది. అరుుతే సహచరులంతా విఫలమైనా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (136 బంతుల్లో 173; 24 ఫోర్లు) మాత్రం అసమాన ఆటతీరును ప్రదర్శించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న తను 88 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. అరుుతే దాదాపు చివరిదాకా క్రీజులో నిలిచిన వార్నర్... 48వ ఓవర్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. అబాట్, రబడా, తాహిర్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు.