స్టీవ్ స్మిత్
డర్బన్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఇరు జట్లు సమంగా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (56), డేవిడ్ వార్నర్ (51) అర్ధసెంచరీలు సాధించగా, షాన్ మార్‡్ష (40) ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తక్కువ వ్యవధిలో బెన్‌క్రాఫ్ట్ (5), ఉస్మాన్ ఖాజా (14) వికెట్లు కోల్పోయింది. అయితే మూడో వికెట్‌కు వార్నర్‌తో 56 పరుగులు, నాలుగో వికెట్‌కు మార్‡్షతో 56 పరుగులు జోడించి స్మిత్ జట్టును ఆదుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో చెలరేగిన స్మిత్ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ అర్ధ సెంచరీ చేశాడు.
ఈ క్రమంలో తాను ఆడిన 20 టెస్టు సిరీస్‌లలో ప్రతీదాంట్లో కనీసం ఒక అర్ధ సెంచరీ అయినా సాధించిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్, మార్‡్షలను 26 పరుగుల వ్యవధిలో అవుట్ చేసి దక్షిణాఫ్రికా పట్టు బిగించే ప్రయత్నం చేసింది. అయితే మిషెల్ మార్‡్ష (32), టిమ్ పైన్ (21) ఆరో వికెట్‌కు అభేద్యంగా 48 పరుగులు జత చేసి ఇన్నింగ్స్ కుప్పకూలిపోకుండా కాపాడారు. ఫిలాండర్, మహరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. వెలుతురు లేమి కారణంగా 17 ఓవర్ల ముందుగానే ఆట ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment