గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ: స్టీవ్ స్మిత్
గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ: స్టీవ్ స్మిత్
Published Thu, May 25 2017 9:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
ఇంగ్లండ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిని గెలిచే అవకాశాలు తమకే ఉన్నాయని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌తో గత రెండు నెలలుగా భారత్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ టోర్నమెంట్‌ను అస్వాదించామని స్మిత్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అనువైన ప్రదేశమని, ఇక్కడ ఆటగాళ్ల సత్తా బయటకు వస్తుందని చెప్పాడు. గత కొద్ది రోజులుగా మేము తీరిక లేకుండా గడిపామని అయినా శారీరకంగా, మానసికంగా దృడంగా ఉన్నామని పేర్కొన్నాడు.
రెండు సంత్సరాలకోసారి జరిగే ఈ ట్రోఫి మాకు చాల ముఖ్యమైనదని, మా విజయాలకు కొంత బ్రేక్ వచ్చినా.. ఇప్పుడు టైటిల్ లక్ష్యంగా ఆడుతామని స్మిత్ చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్ లో ఆస్ట్రేలియా గట్టి పోటినిచ్చిందని గుర్తు చేశాడు. చాంపియన్స్ ట్రోఫిలో మాకు మంచి రికార్డు ఉంది. దీన్ని ఇలానే కోనగిస్తామని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గెలుపే మాకు కావలి దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని దాని పైనే మా దృష్టంతా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ సీరిస్‌కు ముందు భారత్‌తో టెస్టు సిరీస్, ఐపీఎల్ మినహా వన్డేలు ఆడలేదని, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరిదన్నాడు.
ఈ సిరీస్ లో 2-0 ఓడిపోయిన దీని ప్రభావం మా పై ఉండదని, చాంపియన్స్ ట్రోఫికి ముందే జరిగే వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటామన్నాడు. ఆస్ట్రేలియాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, ఇక్కడ ఇంతకు ముందు రాణించిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని, కచ్చితంగా టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. టోర్నిలో పాల్గొనె జట్లు అన్ని బలంగా ఉన్నాయని, మంచి క్రికెట్ జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
Advertisement