
మెల్‌బోర్న్: మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ (275 బంతుల్లో 102 నాటౌట్; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్మిత్‌కు జతగా వార్నర్ (227 బంతుల్లో 87; 8 ఫోర్లు), మిచెల్ మార్‡్ష (166 బంతుల్లో 29 నాటౌట్) కూడా పట్టుదలగా ఆడటంతో ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు ‘డ్రా’గా ముగిసింది.
ఓవర్‌నైట్ స్కోరు 103/2తో శనివారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 124.2 ఓవర్లలో 263/4 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఫలితం రాదని ముందే తేలడంతో ఇరు జట్ల కెప్టెన్‌లు ‘డ్రా’కు అంగీకరించారు. దాదాపు రోజంతా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి మరో 160 పరుగులు మాత్రమే జతచేసింది. చివరి టెస్టు గురువారం సిడ్నీలో ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment