రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌దే విజయం | England have won in the second ODI | Sakshi
Sakshi News home page

 రెండో వన్డేలోనూ ఇంగ్లండ్‌దే విజయం

Published Sat, Jan 20 2018 1:07 AM | Last Updated on Sat, Jan 20 2018 1:07 AM

England have won in the second ODI - Sakshi

బ్రిస్బేన్‌: వరుసగా రెండో వన్డేలోనూ ఆసీస్‌కు ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్లతో గెలిచి ఐదు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత ఆసీస్‌ 9 వికెట్లకు 270 పరుగులు చేసింది. ఫించ్‌ (106; 9 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు.

ఇంగ్లండ్‌ ఆరు వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి విజయం సాధించింది. బెయిర్‌ స్టో (60; 9 ఫోర్లు),  హేల్స్‌ (57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జో రూట్‌ (46 నాటౌట్‌), బట్లర్‌ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు), వోక్స్‌ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తలోచేయి వేశారు. మూడో వన్డే ఆదివారం సిడ్నీలో జరుగనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement