
కమిన్స్
అడిలైడ్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా ...ఇంగ్లండ్‌తో శుక్ర వారం జరిగిన నాలుగో వన్డేలో మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఆసీస్ పేసర్లు కమిన్స్ (4/24), హజల్‌వుడ్ (3/39), టై (3/33) ధాటికి ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. వోక్స్ (78; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం ఓపెనర్ ట్రావిస్ హెడ్ (107 బంతుల్లో 96; 15 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 37 ఓవర్లలో ఏడు వికెట్లకు 197 పరుగులు చేసి గెలుపొందింది. చివరి వన్డే ఆదివారం పెర్త్‌లో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment