
ఆసీస్ కెప్టెన్ స్మిత్ మరో అరుదైన జాబితాలో చేరిపోయాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టు మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు పూర్తిచేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించాడు. సచిన్ 110 మ్యాచ్‌ల్లో 21 సెంచరీలు చేయగా, స్మిత్ 105 మ్యాచ్‌ల్లోనే పూర్తి చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న యాషెస్ తొలి టెస్టులో స్మిత్ ఈ రికార్డును చేరుకున్నాడు.
ఇప్పటి వరకూ ఈ జాబితాలో నలుగురు మాత్రమే ఉండగా తాజాగా స్మిత్ ఈ జాబితాలో చేరకున్నాడు, గతంలో బ్రాడ్‌మన్ 21 టెస్టు సెంచరీలను 56 మ్యాచ్‌ల్లో పూర్తి చేయగా, గవాస్కర్ 98 ఇన్నింగ్స్‌ల్లో పూర్తిచేశాడు. తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండగా ఇప్పుడు స్మిత్ ఆస్థానానికి వచ్చాడు. ఐదోస్థానంలో పాకిస్తాన్‌కు చెందిన యూసఫ్ యుహానా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment