పెర్త్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీని కూడా నమోదు చేయని కుక్.. ఇంగ్లండ్ దారుణమైన పరాజయాలు చెందడంలో భాగమయ్యాడు. కాగా, పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందడంతో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో అత్యధిక పరాజయాలు చవి చూసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ చేరిపోయాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద కుక్‌కు ఇది 14వ ఓటమి. తద్వారా సచిన్ రికార్డును కుక్ సమం చేశాడు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ఆస్ట్రేలియాలో అత్యధికంగా 14 పరాజయాల్లో భాగమయ్యాడు.
అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హోబ్స్‌లు ఆస్ట్రేలియాలో 14 టెస్టు ఓటములు చవిచూసిన ఆటగాడు. తాజాగా కుక్ వారిద్దరి సరసన చేరిపోయాడు. ఒకప్పుడు సచిన్ అత్యధిక టెస్టు రికార్డుల్ని బ్రేక్ చేసేలా కనిపించిన కుక్ తర్వాత వెనుకబడి పడిపోయాడు. తొలి వంద టెస్టుల్లో 25 సెంచరీలు చేసిన కుక్. ఆపై తర్వాత ఆడిన 50 టెస్టుల్లో కేవలం 6 శతకాలు మాత్రమే సాధించాడు. ఈ యాషెస్‌లో కుక్ సగటు 14 మాత్రమే. ఏ సిరీస్ పరంగా చూసినా అతడికి ఇదే అత్యల్పం కావడం గమనార్హం. మరొకవైపు పెర్త్‌లో జరిగిన మ్యాచ్ కుక్ కు 150వ టెస్టు మ్యాచ్. యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ 0-3తేడాతో ఆసీస్‌కు సమర‍్పించుకుంది. వరుసగా మూడు టెస్టుల్లో ఓడి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment