న్యూఢిల్లీ: యాషెస్ సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘనంగా కొనియాడాడు. ఓ బ్యాట్స్‌మన్‌గా టెక్నిక్ విషయం చర్చనీయాంశమైనా... స్మిత్ మానసిక దృక్పథం చాలా గొప్పదని పేర్కొన్నాడు. ‘స్మిత్ పునరాగమనం నమ్మశక్యం కానిది’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. యాషెస్ సిరీస్‌లో స్మిత్ చూపించిన అద్భుత ప్రదర్శనను విశ్లేషిస్తూ సచిన్ వీడియో పోస్ట్ చేశాడు.
స్మిత్ ఆట, బ్యాటింగ్ శైలి తదితర సాంకేతిక అంశాలను క్రికెట్ దిగ్గజం వివరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. యాషెస్‌లో తనను ఔట్ చేసేందుకు ఇంగ్లండ్ బౌలర్లు పన్నిన వ్యూహాలను క్రీజులో భిన్నమైన స్టాన్స్‌తో స్మిత్ తిప్పికొట్టిన వైనాన్ని సచిన్ తన కోణంలో విశదీకరించాడు. రెండో టెస్టులో ఆర్చర్ బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో స్మిత్ చేసిన పొరపాటుకు కారణం ఏమిటో కూడా సచిన్ తనదైన శైలిలో చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment