యాషెస్ సిరీస్ 2023 ఐదో టెస్ట్ చివరి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో (లంచ్‌కు ముందు ఓవర్ తొలి బంతికి) మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్టీవ్ స్మిత్ (40) క్యాచ్‌ను జారవిడిచాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో స్మిత్ గ్లవ్స్‌ను తాకిన బంతిని లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అతికష్టం మీద (చాలా ఎత్తుకు ఎగిరి) పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేశాడు.
STOKES 😒pic.twitter.com/OUD88ZWZkF
— CricTracker (@Cricketracker) July 31, 2023
సంబురాలు చేసుకునే తొందరలో స్టోక్స్ మోకాలికి తగిలి బంతి నేలపాలైంది. ఇంతటితో ఆగకుండా స్టోక్స్ రివ్యూకి వెళ్లి ఇంకో ఘోర తప్పిదం చేశాడు. రీప్లేలో బంతి స్మిత్ గ్లవ్స్‌కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్ చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇంగ్లండ్ అప్పీల్‌కు నాటౌట్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్‌కు వికెట్ దక్కకపోగా, రివ్యూ కోల్పోయింది.
It's lunch on Day 5.
— CricTracker (@Cricketracker) July 31, 2023
Steve Smith and Travis Head keep Australia steady as teams head for Lunch. pic.twitter.com/8mTKpA0eXZ
కాగా, స్టోక్స్.. స్టీవ్ స్మిత్ క్యాచ్ జారవిడిచాక ఆట మరో 5 బంతుల పాటు సాగింది. అనంతరం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 238/3గా ఉంది. స్టీవ్ స్మిత్ (40), ట్రవిస్ హెడ్ (31) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ గెలవాలంటే 146 పరుగులు, ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉంది. లంచ్ విరామ సమయం పూర్తయ్యాక కూడా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్‌ను పాక్షికంగా నిలిపివేశారు.
ఇదిలా ఉంటే, 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్‌లు ఆసీస్ ఆటగాళ్లను వణికించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్‌నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment