ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రవర్తనపై ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యూజీలాండ్తో మ్యాచ్ సందర్భంగా స్టార్క్ ప్రవర్తన తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నాడు. గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరిరోజున స్టార్క్ తన సహనాన్ని కోల్పోయి న్యూజీలాండ్ బ్యాట్స్మెన్ మార్క్ క్రేగ్కు సమీపంగా బంతిని విసిరాడు. 84 వ ఓవర్లో స్టార్క్ బౌలింగ్లో క్రేగ్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో సహనాన్ని కోల్పోయిన స్టార్క్ తరువాత తనవైపు వచ్చిన బంతిని పట్టుకొని బలంగా క్రేగ్ వైపు విసిరాడు.
స్టార్క్ ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదన్న స్మిత్ తనకు కలిగిన అసహనాన్ని మరో విధంగా ఆట ద్వారా చూపాలి తప్ప ఇలా బంతిని బ్యాట్స్మెన్ పైకి విసరడం కరెక్ట్ కాదన్నారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా న్యూజీలాండ్పై విజయం సాధించింది. తరువాత మ్యాచ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని సహచర ఆటగాన్ని స్మిత్ హెచ్చరించాడు.