న్యూఢిల్లీ: మరోసారి స్పిన్ ప్రభావం ఉంటుందా...తొలి మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిస్తే ఇది ఎన్ని రోజులు సాగుతుంది... ఆసీస్ మన స్టార్లు అశ్విన్, జడేజాలను ఎదుర్కోగలదా...అసలు ఆ జట్టు పోరాడగలదా...టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శిస్తుందా... ఇలాంటి ఆలోచనలు, అంచనాల మధ్య రెండో టెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ్రస్టేలియాకు పెను సవాల్ విసిరేందుకు మరో స్పిన్ వికెట్ స్వాగతం పలుకుతోంది.
ప్రపంచ టెస్టు క్రికెట్‌లో టాప్–2 జట్లయిన ఆసీస్, భారత్‌ల మధ్య నేటి నుంచి ఢిల్లీ కోటలో రెండో టెస్టు జరుగుతుంది. ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత్ తొలి టెస్టు గెలిచి 1–0తో పైచేయి సాధించింది. మరోవైపు మేటి జట్టు ఆ్రస్టేలియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వంద ఓవర్లయినా ఎదుర్కోలేకపోవడం జట్టు స్థైర్యాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు సిరీస్‌లో పుంజుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిందే!
ఉత్సాహంగా భారత్
సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్ ఇప్పుడు ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో రోహిత్ ఫామ్‌లో ఉండగా, వందో టెస్టు ఆడనున్న చతేశ్వర్ పుజారా దీన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. గత టెస్టులో పుజారా, కోహ్లి విఫలమయ్యారు. కానీ తన సొంతగడ్డయిన ఢిల్లీపై కోహ్లి చెలరేగడం ఖాయం. శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ సాధించడంతో సూర్యకుమార్ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజాతో పాటు శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్ వరకు అంటే తొమ్మిదో వరుస వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం కచి్చతంగా అదనపు బలం కాగలదు.
అశ్విన్‌కు ఢిల్లీ అచ్చొచ్చిన పిచ్. ఇక్కడ నాలుగు టెస్టులాడి ఏకంగా 27 వికెట్లు తీశాడు. జడేజా, అక్షర్‌ల స్పిన్ తప్పకుండా మ్యాచ్‌ను మలుపుతిప్పగలదు. కొన్ని గణాంకాలు భారత జట్టును ఊరిస్తున్నాయి. 1987 తర్వాత ఢిల్లీలో భారత్ పరాజయమే ఎరుగదు. చివరిసారిగా ఆ ఏడాది విండీస్ చేతిలో ఓడిన టీమిండియా తదనంతరం గెలవడం లేదంటే డ్రా చేసుకుంది కానీ... ఏ టెస్టులోనూ ఓడలేదు. 249 వికెట్లతో ఉన్న జడేజా ఒక్క వికెట్ తీస్తే 250 మార్క్‌ను అధిగమిస్తాడు.
పుంజుకోవడం ఎలా!
భారత్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి స్పిన్ బూచిపై కంగారు పడిన ఆ్రస్టేలియా ప్రత్యేక కసరత్తులు చేసింది. వార్నర్, ఉస్మాన్ ఖాజా, లబుõÙన్, స్మిత్ ఇలా మేటి బ్యాటర్స్ అంతా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నారు. కానీ ఆట దగ్గరకు వచ్చేసరికి వార్నర్ (1, 10), ఖాజా (1, 5)ల ఓపెనింగ్ అత్యంత పేలవంగా మొదలైంది. ఇది రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జట్టును చావుదెబ్బ తీసింది. ప్రత్యర్థి స్పిన్ అస్త్రాలకు మిడిలార్డర్ ఇంకాస్త బలహీనపడింది. ఢిల్లీ కూడా అలాంటి వికెటే కావడంతో ఆ్రస్టేలియా శిబిరంలో ఆందోళన పెరుగుతుంది. అనుభవజు్ఞడైన స్మిత్, ఫామ్‌లో ఉన్న లబుõÙన్ బాధ్యతగా ఆడితే బ్యాటింగ్‌లో జట్టు నిలబడేందుకు అస్కారం వుంటుంది. కమిన్స్, మరీ్ఫ, లయన్, బోలండ్‌లతో కూడిన బౌలింగ్ దళం కూడా ఆతిథ్య బ్యాటర్లపై ప్రభావం చూపిస్తేనే ఈ మ్యాచ్‌లో పుంజుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment