ముంబై: భారత్, ఆ్రస్టేలియా మహిళల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం లభించినా...టెస్టు ఇంకా భారత్ చేతుల్లోనే ఉంది. చివరి రోజు ఆసీస్‌ను తొందరగా ఆలౌట్ చేయగలిగితే స్వల్ప ల„ ్యాన్ని భారత్ ఛేదించేందుకు అవకాశం ఉంటుంది. తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కాస్త మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా...శనివారం ఆట చివర్లో భారత్‌కు మళ్లీ పట్టు చిక్కింది.
ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. తహీలా మెక్‌గ్రాత్ (177 బంతుల్లో 73; 10 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా...ఎలైస్ పెరీ (91 బంతుల్లో 45; 5 ఫోర్లు), బెత్ మూనీ (33), కెప్టెన్అలీసా హీలీ (32) కీలక పరుగులు జోడించారు. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ప్రస్తుతం ఆసీస్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 376/7తో ఆట కొనసాగించిన భారత్ మరో 30 పరుగులు జోడించి తమ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (78)ను గార్త్ బౌల్డ్ చేయగా...పూజ వస్త్రకర్ (47), రేణుకా సింగ్ (8)లను గార్డ్‌నర్ వెనక్కి పంపించింది. దాంతో భారత్‌కు 187 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
కీలక భాగస్వామ్యాలు...
రెండో ఇన్నింగ్స్‌లో ఆ్రస్టేలియాకు మెరుగైన ఆరంభం లభించింది. మూనీ, లిచ్‌ఫీల్డ్ (18) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే మూనీ స్వయంకృతంతో రనౌట్ కావడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది. రాణా బౌలింగ్‌లో మూనీ ముందుకొచ్చి డిఫెన్స్ ఆడగా చురుగ్గా ఉన్న సిల్లీ పాయింట్ ఫీల్డర్ రిచా వెంటనే బంతికి వికెట్లపైకి విసిరింది. సరైన సమయంలో వెనక్కి వెళ్లలేక మూనీ వెనుదిరిగింది. లిచ్‌ఫీల్డ్‌నూ రాణానే అవుట్ చేశాక మెక్‌గ్రాత్, పెరీ కలిసి జట్టును ఆదుకున్నారు. భారత స్పిన్నర్లను వీరు సమర్థంగా ఎదుర్కొన్నారు.
15 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ ఇచ్చిన క్యాచ్‌ను రాణా వదిలేయడం ఆసీస్‌కు కలిసొచ్చింది. మెక్‌గ్రాత్, పెరీ మూడో వికెట్‌కు 84 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత హీలీతో కలిసి మెక్‌గ్రాత్ ఇన్నింగ్స్‌ను నడిపించింది. 119 బంతుల్లో ఈ మ్యాచ్‌లో రెండో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్...రేణుక ఓవర్లో వరుసగా 3 ఫోర్లతో ఆసీస్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆసీస్ బ్యాటర్లు పాతుకుపోగా, వరుసగా 28.2 ఓవర్ల పాటు భారత్ వికెట్ తీయడంలో విఫలమైంది. ఈ దశలో కెపె్టన్ హర్మన్ తానే స్వయంగా బౌలింగ్‌కు దిగింది.
తొలి ఓవర్లోనే చక్కటి బంతితో మెక్‌గ్రాత్‌ను బౌల్డ్ చేసి 66 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు తెర దించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే హీలీని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని హర్మన్ మ్యాచ్‌ను మళ్లీ భారత్ చేతుల్లోకి తెచ్చింది. అంతకు ముందు బంతికే హర్మన్, హీలీ మధ్య ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’కు సంబంధించి తీవ్ర వాదోపవాదన జరిగిన తర్వాత ఈ వికెట్ దక్కడం విశేషం. ఆ తర్వాత 62 బంతుల పాటు జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా సదర్లాండ్ (12 నాటౌట్), గార్డ్‌నర్ (7 నాటౌట్) ఆటను ముగించారు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 219;
భారత్ తొలి ఇన్నింగ్స్ 406;
ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: మూనీ (రనౌట్) 33; లిచ్‌ఫీల్డ్ (బి) రాణా 18; పెరీ (సి) యస్తిక (బి) రాణా 45; తహీలా మెక్‌గ్రాత్ (బి) హర్మన్ 73; హీలీ (ఎల్బీ) (బి) హర్మన్ 32; సదర్లాండ్ (నాటౌట్) 12; గార్డ్‌నర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 233. వికెట్ల పతనం: 1–49, 2–56, 3–140, 4–206, 5–221. బౌలింగ్: రేణుకా సింగ్ 8–3–22–0, పూజ వస్త్రకర్ 8–0–36–0, స్నేహ్ రాణా 17–3–54–2, దీప్తి శర్మ 19–5–30–0, రాజేశ్వరి 27–10–42–0, జెమీమా 2–0–13–0, హర్మన్‌ప్రీత్ 9–0–23–2.
Comments
Please login to add a commentAdd a comment