
స్టీవ్ స్మిత్ ,విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లిని చూసే స్పిన్‌ను ఎలా ఆడాలో తాను నేర్చుకున్నానని ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. కోహ్లి ఆఫ్‌సైడ్ బంతిని కొట్టే పద్ధతిని తాను అనుసరించినట్లు వివరించాడు. భారత పర్యటనలో కీపర్, స్లిప్ క్యాచ్‌లతో అవుట్ కాకుండా ఉండేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నాడు.
బ్యాట్‌ను పట్టుకునే తీరు మార్చుకోవడం వల్ల మైదానంలో అన్నివైపులా షాట్లు కొట్టగలిగానన్న స్మిత్... కోహ్లితో పాటు డివిలియర్స్, విలియమ్సన్‌లను కూడా వేర్వేరు అంశాల్లో అనుకరించినట్లు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment