ధోని హీరో.. విలన్.. స్మిత్: స్టోక్స్ | MS Dhoni a Bollywood Hero, Steve Smith a Villain: Ben Stokes | Sakshi
Sakshi News home page

ధోని హీరో..విలన్.. స్మిత్: స్టోక్స్

Published Wed, Apr 26 2017 5:07 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

ధోని హీరో.. విలన్.. స్మిత్: స్టోక్స్

ధోని హీరో.. విలన్.. స్మిత్: స్టోక్స్

పుణే: భారత క్రికెటర్, రైజింగ్ పుణే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని బాలీవుడ్ హీరో అని, పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ విలన్ అని సరదాగా చమత్కరించాడు బెన్ స్టోక్స్. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న రైజింగ్ పుణే బుధవారం కోల్ కతా తో జరిగే మ్యాచ్ గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉంది. మహేంద్ర సింగ్ ధోని విరోచిత బ్యాటింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ పై, రూ.13 కోట్ల ఆటగాడు బెన్ స్టోక్స్ బౌలింగ్ తో ముంబై పై స్టన్నింగ్ విక్టరీలు అందుకున్న పుణే అదే ఊపు ను కోల్ కతా పై కొనసాగించాలనుకుంటుంది. ఈ సందర్భంగా పుణే ఆటగాళ్లు కోన్ని లాకర్ రూం ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సరదాగా గడిపిన ఓ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. దీనిలో కొన్ని సరదా ప్రశ్నలకు పుణే ఆటగాళ్లు చమత్కారమైన సమాధానాలు ఇచ్చారు.

ఈ జట్టులో రహ్యాసాన్ని కాపాడే వ్యక్తి ఏవరని ధోనిని ప్రశ్నించగా తన ఫోటో ప్లకార్డునే చూపించాడు. ఇదే ప్రశ్నకు అజింక్యా రహేనా కూడా ధోని ప్లకార్డు చూపించాడు. బెన్ స్టోక్స్ మాత్రం డుప్లెసిస్ ను చూపించాడు. ముగ్గురు ఏకగ్రీవంగా రహస్యాన్ని కాపాడే వ్యక్తి అశోక్ దిండా అని ఒప్పుకున్నారు. ఈ జట్టులో అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కవగా ఉన్న క్రికెటర్ ఏవరు అన్న ప్రశ్నకు బెన్ స్టోక్స్, రహానే 'ధోని' అని చెప్పగా ధోని కూడా తనకే ఉంటారన్నాడు. ఐపీఎల్ జట్లలో బాలీవుడ్ హీరోలా ఉండే క్రికెటర్ ఎవరని అడగ్గా స్టోక్స్ వెంటనే ధోని ప్లకార్డు చూపించాడు. ఇక విలన్ ఎవరనగా నవ్వుతూ పుణే కెప్టెన్ స్మిత్ ప్లకార్డును చూపించాడు ఈ ఇంగ్లండ్ ఆటగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement