స్టీవ్‌ స్మిత్‌ విలవిల్లాడిపోయాడు.. | Steve Smith survived a horrific collision with Ben Stokes In ipl | Sakshi
Sakshi News home page

స్టీవ్‌ స్మిత్‌ విలవిల్లాడిపోయాడు..

Published Thu, May 4 2017 10:11 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

స్టీవ్‌ స్మిత్‌ విలవిల్లాడిపోయాడు..

స్టీవ్‌ స్మిత్‌ విలవిల్లాడిపోయాడు..

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌ లోనే కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ కు రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ సూపర్‌ షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌ లో ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన కోల్‌ కతా ఇన్నింగ్స్‌ లో షాకింగ్‌ ఘటన జరిగింది. పుణే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఢీకొన్నారు. దీంతో స్మిత్‌ కాసేపు విలవిల్లాడిపోయాడు. ఫీల్డ్‌ లో సులువుగా కదలలేకపోయాడు. మ్యాట్‌ తీసుకురావాలని స్టోక్స్‌ ఫిజియోను పిలిచినా.. కష్టమ్మీద స్మిత్‌ నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

జయదేవ్‌ ఉనాద్కత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్ ఐదో బంతిని కోల్టర్‌ నీల్‌ షాట్‌ ఆడాడు. బౌండరీ అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్‌ పట్టాలని స్టోక్స్‌ యత్నించాడు. స్మిత్‌ కూడా బంతిని ఆపాలని పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్‌ వద్దకు వచ్చాడు. స్టోక్స్‌ తన చేతిలో పడిని బంతిని గాల్లోకి విసురుతూ.. బౌండరీ లైన్‌ దాటాడు. అయితే ఈ క్రమంలో స్టోక్స్‌ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్‌ అవతల ఉన్న బోర్డుకు స్మిత్‌ తల గుద్దుకుంది. దీంతో కాసేపు అలాగే ఉండిపోయాడు. ఫిజియో వచ్చినా స్మిత్‌ ఎవరి సాయం లేకుండా నొప్పిగా ఉన్నా అలాగే వెళ్లిపోయాడు. ఆపై బ్యాటింగ్‌ లో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు.

ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులతో రాహుల్‌ త్రిపాఠి సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడటంతో కోల్‌ కతాపై పుణే 4 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement