rising pune super giant
-
ఐపీఎల్ ఫైనల్: ముంబైలో కలవరం!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో తుది అంకానికి రెండుజట్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్, రెండుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ చేరుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణే వరుస విజయాలతో ఫైనల్ చేరగా, ముంబై మాత్రం కొన్ని విషయాలలో ఆందోళన చెందుతుంది. ముంబై ఇండియన్స్‌ను రెండు సెంటిమెంట్లు ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్లో పుణే చేతిలో మూడు పర్యాయాలు ఓడిపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే.. లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడితే లీగ్‌లో రెండో స్థానంలో నిలిచన టీమ్‌ను ఐపీఎల్ కప్ వరిస్తుండటం ముంబైపై ఒత్తిడి పెంచుతుంది. లీగ్ దశలో 14 మ్యాచ్లకుగానూ 10 మ్యాచ్‌లు నెగ్గి నాలుగింట్లో ఓడగా, రెండు పర్యాయాలు పుణే చేతిలో ఓటమి పాలవడం ఇప్పుడు ముంబై జట్టును కలవరపాటుకు గురిచేస్తుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ తమ చేతిలో ఓడిన ముంబైతో ఫైనల్ మ్యాచ్ కావడం పుణేలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. లీగ్ దశలో 20 పాయింట్లు, 18 పాయింట్లతో పట్టికలో ముంబై, పుణే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌తో సహా ఈ సీజన్లో తలపడిన మూడు పర్యాయాలు పుణే చేతిలో ముంబై ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై నెగ్గి ముంబై ఫైనల్లోకి దూసుకెళ్లినా పుణే అడ్డంకిని అధిగమిస్తేనే వారు మూడోసారి చాంపియన్‌గా అవతరిస్తారు. మరోవైపు ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్) సంప్రదాయం ప్రవేశపెట్టిన 2011 ఏడాది నుంచి ఫైనల్ విజేతల వివరాలను గమనిస్తే ముంబైకి ఫైనల్ ఫీవర్ తప్పదని చెప్పవచ్చు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ (2), ఆర్సీబీ(1) తలపడగా చెన్నై నెగ్గింది. 2013 ఫైనల్లో ముంబై (2), సీఎస్కే(1) ఆడగా ముంబై టైటిల్ సాధించగా, 2014లో పంజాబ్(1)పై కేకేఆర్(2) విజయం సాధించగా, చివరగా 2015లో చెన్నై(1)ని ముంబై(2) ఓడించి సగర్వంగా కప్పును రెండో సారి అందుకుంది. ముంబై నెగ్గిన రెండు సీజన్లలోనూ లీగ్ లో చెన్నై(1)పైనే రెండో స్థానంలో ఉన్న ముంబై(2) గెలుపొందడం గమనార్హం. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ ముంబై ఇండియన్స్ (1) - విజేత ? -
ఐపీఎల్: హిస్టరీ రిపీట్ అయింది!
ముంబై: ఐపీఎల్ లో 2011లో క్వాలిఫయర్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సీజన్లోనూ లీగ్ దశను రెండో స్థానంతో ముగించిన జట్టు కచ్చితంగా ఫైనల్‌కు చేరడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం పుణే జట్టు దాన్ని రిపీట్ చేసింది. ఐపీఎల్10 సీజన్లో తుది పోరుకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ చేరుకుంది. ఇక్కడి వాంఖేడెలో నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై పుణే నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో ముంబై జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన జట్టుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెగ్గితేనే ఫైనల్ చేరుతుంది. ఆపై ఈ సీజన్లో ఆడిన మూడుసార్లు తమను ఓడించిన పుణేపై ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఉంటుంది. 2017లో ఐపీఎల్-10లోనూ ఇప్పుడు అదే జరిగింది. క్వాలిఫయర్-1లో పటిష్టమైన ముంబయిని కంగు తినిపించిన స్టీవ్ స్మిత్ సేన ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో నెంబర్ వన్ గా ఉన్న జట్లు 2012, 2016 సీజన్లలో ఫైనల్ చేరలేదు. కానీ ప్రతి సీజన్లోనూ రెండో స్థానంలో ఉన్న జట్టు ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే.. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయమన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఫైనల్లో టాప్1, 2 జట్లు తలపడితే ఇప్పటివరకూ రెండో స్థానంలో ఉన్న జట్టునే విజయం వరిస్తూ వచ్చింది. 2011 నుంచి లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది. 14 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ లు నెగ్గి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్ ను ఆక్రమించగా, 9 మ్యాచ్ లు నెగ్గి 18 పాయింట్లు సాధించిన పుణె రెండో స్థానాన్ని దక్కించుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్(17పాయింట్లు) మూడో స్థానంలో, కేకేఆర్(16 పాయింట్లు) నాల్గో స్థానంలో నిలిచాయి. నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్, సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. గెలిచిన జట్టును క్వాలిఫయర్-2లో మట్టికరిపిస్తేనే ముంబై ఫైనల్ చేరుతుంది. 2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే.. ⇒ 2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1) - విజేత చెన్నై ⇒ 2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4) - విజేత కేకేఆర్ ⇒ 2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1) - విజేత ముంబై ⇒ 2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1) - విజేత కేకేఆర్ ⇒2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1) - విజేత ముంబై ⇒ 2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3) - విజేత సన్‌రైజర్స్ ⇒ 2017: పుణే(2) వర్సెస్ (క్వాలిఫయర్-2 విన్నర్) ? -
ఐపీఎల్-10: ఫైనల్ కు చేరేదెవరో?
ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత రైజింగ్ పుణెను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ సీజన్ లీగ్ దశలో రైజింగ్ పుణెతో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ముంబైకి ఓటమి ఎదురైంది. దాంతో అసలు సిసలు సమరంలో పుణెపై ప్రతీకారం తీర్చుకునేందుకు ముంబై సిద్ధమైంది. మరొకవైపు ఫైనల్ బెర్త్ దక్కించుకున్న తొలి జట్టుగా నిలవాలని ముంబై ఆశిస్తోంది. అదే సమయంలోముంబైపై తమకున్న సూపర్ ట్రాక్ రికార్డును కొనసాగిస్తూ మరోసారి పైచేయి సాధించాలని పుణే భావిస్తోంది. అయితే ప్రారంభంలోకన్నా రెండో దశలో అనూహ్య ఆటతీరుతో చెలరేగుతున్న పుణే... ఇప్పటికే తాహిర్ సేవలను కోల్పోగా తాజాగా డాషింగ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండానే బరిలోకి దిగబోతోంది. దీంతో అద్భుత ఫామ్‌లో ఉన్న ముంబైని కట్టడి చేయాలంటే ఆ జట్టు తీవ్రంగా శ్రమించక తప్పదు. పుణే జట్టు ప్లే ఆఫ్ వరకు చేరుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదు. అయితే మ్యాచ్‌లు జరుగుతున్నకొద్దీ ఈ జట్టు ఆటతీరు గణనీయంగా మెరుగుపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆరితేరుతూ ప్రత్యర్థులను మట్టికరిపించింది. పుణె పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ఇప్పటికే 21 వికెట్లు పడగొట్టి ఆ జట్టులో కీలక బౌలర్ గా మారాడు. అతనికి శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ సహకరిస్తున్నారు. ఈ త్రయం మరోసారి ముంబైపై విజృంభించాలని భావిస్తుంది. స్పిన్నర్ జంపా కూడా రాణించడం ఈ జట్టుకు కలిసొచ్చేది. బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్, రాహుల్ త్రిపాఠి, రహానే, ధోని, మనోజ్ తివారి ఫామ్‌లో ఉండడం అనుకూలాంశం. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టే క్రమంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.ఒకవేళ తొలి క్వాలిఫయర్ లో ఓడితే 19న బెంగళూరులో జరిగే రెండో క్వాలిఫయర్ ఆడాల్సి ఉంటుంది. మరి తుది పోరుకు ముందుగా ఎవరు చేరతారో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
చిత్తయిన రాజులు
-
చిత్తయిన రాజులు
►పుణే అలవోకగా ప్లే–ఆఫ్‌కు... ►చిత్తుగా ఓడిన పంజాబ్ ►సమష్టిగా రాణించిన పుణే బౌలర్లు పుణే: హోరాహోరి తప్పదనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. తుదికంటా పోరాడాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అరంభం నుంచే తడబడింది. కనీస బాధ్యతే లేకుండా బ్యాట్లేత్తేసింది. దీంతో రైజింగ్ పుణే చెమటోడ్చకుండానే ప్లే–ఆఫ్ చేరింది. ఆదివారం జరిగిన పోరులో బౌలర్లు సమష్టిగా రాణించడంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగుల వద్ద ఆలౌటైంది. అక్షర్ పటేల్ (22)దే అత్యధిక స్కోరు. శార్దుల్ ఠాకూర్ 3, ఉనాద్కట్, జంపా, క్రిస్టియాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత పుణే 12 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది. రహానే (34 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (20 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 73 పరుగులకే ఆలౌట్ టాస్ నెగ్గిన పుణే సారథి స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బౌలర్లు తమ బౌలర్ నిర్ణయం సరైందని తొలి బంతినుంచే నిరూపించారు. వృద్ధిమాన్ సాహా (13)తో పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గప్టిల్ (0) ఉనాద్కట్ తొలిబంతికే డకౌట్ అయ్యాడు. తర్వాత శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ తలా ఒక దెబ్బతీయడంతో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ (32/5) సగం వికెట్లను కోల్పోయింది. మార్‡్ష (10), మోర్గాన్ (4), రాహుల్ తెవాటియా (4), మ్యాక్స్‌వెల్ (0) ఇలా అందరూ ఆడేందుకు కాకుండా... వికెట్లు సమర్పించుకునేందుకే వరుస కట్టారు. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ (22) కాస్త మెరుగనిపించినా... క్రిస్టియాన్ అతన్ని బోల్తాకొట్టించాడు. టెయిలెండర్లు మోహిత్ శర్మ (6), ఇషాంత్ శర్మ (1) జంపా ఔట్ చేయడంతో 73 పరుగుల వద్ద పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది. రాణించిన రహానే సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడారు. తర్వాత స్పీడ్ పెంచిన త్రిపాఠి... ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, రాహుల్ తెవాటియా మరుసటి ఓవర్లో భారీ సిక్సర్‌తో అలరించాడు. ఇదే జోరులో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ స్మిత్ (18 బంతుల్లో 15 నాటౌట్), రహానేకు జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో 18 పాయింట్లు పొందిన పుణే రెండో స్థానంలో నిలిచింది. 16న ముంబైతో జరిగే తొలి క్వాలిఫయర్‌లో తలపడనుంది. అందులో ఓడిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశం రెండో క్వాలిఫయర్ రూపంలో సజీవంగా ఉంటుంది. -
స్టీవ్ స్మిత్ విలవిల్లాడిపోయాడు..
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ లోనే కోల్ కతా నైట్ రైడర్స్ కు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ సూపర్ షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఇన్నింగ్స్ లో షాకింగ్ ఘటన జరిగింది. పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఢీకొన్నారు. దీంతో స్మిత్ కాసేపు విలవిల్లాడిపోయాడు. ఫీల్డ్ లో సులువుగా కదలలేకపోయాడు. మ్యాట్ తీసుకురావాలని స్టోక్స్ ఫిజియోను పిలిచినా.. కష్టమ్మీద స్మిత్ నడుచుకుంటూ వెళ్లిపోయాడు. జయదేవ్ ఉనాద్కత్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఐదో బంతిని కోల్టర్ నీల్ షాట్ ఆడాడు. బౌండరీ అవతలపడే బంతిని ఎలాగైనా ఆపాలని, వీలైతే క్యాచ్ పట్టాలని స్టోక్స్ యత్నించాడు. స్మిత్ కూడా బంతిని ఆపాలని పరుగెత్తుకుంటూ బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. స్టోక్స్ తన చేతిలో పడిని బంతిని గాల్లోకి విసురుతూ.. బౌండరీ లైన్ దాటాడు. అయితే ఈ క్రమంలో స్టోక్స్ గట్టిగా తగలడంతో బౌండరీ లైన్ అవతల ఉన్న బోర్డుకు స్మిత్ తల గుద్దుకుంది. దీంతో కాసేపు అలాగే ఉండిపోయాడు. ఫిజియో వచ్చినా స్మిత్ ఎవరి సాయం లేకుండా నొప్పిగా ఉన్నా అలాగే వెళ్లిపోయాడు. ఆపై బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులతో రాహుల్ త్రిపాఠి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో కోల్ కతాపై పుణే 4 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. -
స్టీవ్ స్మిత్ విలవిల్లాడిపోయాడు..
-
కోల్‌కతాపై రైజింగ్ పుణే విజయం
-
త్రిపాఠి తడాఖా
⇒ 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 ⇒ కోల్‌కతాపై రైజింగ్ పుణే విజయం కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి (52 బంతుల్లో 93; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ షోకు కోల్‌కతా చెదిరింది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జట్టులో మేటి బ్యాట్స్‌మెన్ స్మిత్, స్టోక్స్, ధోనిలు విఫలమైన చోట అతనొక్కడే అంతా తానై నడిపించాడు. సెంచరీని చేజార్చుకున్నా... అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు త్రిపాఠి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో పుణే విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. గ్రాండ్‌హోమ్ వేసిన ఈ ఓవర్ తొలి బంతికి సుందర్ సింగిల్ తీయగా... రెండో బంతిని ఆడిన క్రిస్టియాన్ సిక్సర్‌గా మలిచి పుణే విజయాన్ని ఖాయం చేశాడు. త్రిపాఠికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోల్‌కతాకిది వరుసగా రెండో పరాజయం కాగా... రైజింగ్ పుణేకు ‘హ్యాట్రిక్’ విజయం. విరుచుకుపడిన త్రిపాఠి: ఊరించే లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే జట్టును ఓపెనర్ రాహుల్ త్రిపాఠి ముందుండి నడిపించాడు. మరో ఓపెనర్ రహానే (11), కెప్టెన్ స్మిత్ (9), మనోజ్ తివారి (8) విఫలమైనా... ఆ ప్రభావమేమీ పడకుండా జట్టు లక్ష్యం చేరిందంటే... అది త్రిపాఠి మెరుపుల వల్లే! ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన త్రిపాఠి చూడచక్కని బౌండరీలు, చుక్కల్ని తలపించే సిక్సర్లతో అలరించాడు. దీంతో పుణే ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని అధిగమించింది. స్టోక్స్ చేసింది 14 పరుగులే అయినా... కాసేపు త్రిపాఠికి అండగా నిలిచాడు. ధోని (5) విఫలం కాగా... కోల్‌కతా బౌలర్లలో వోక్స్ 3, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, కుల్దీప్ తలో వికెట్ తీశారు. తడబడిన నైట్‌రైడర్స్: అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును పుణే పేసర్లు వణికించారు. ఓపెనర్ నరైన్ (0)ను ఉనాద్కట్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చగా, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ జాక్సన్ (10) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. ఇది మొదలు వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో నైట్‌రైడర్స్ పరుగుల వేగం తగ్గింది. మనీశ్ చేసిన 37 (32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్) పరుగులే ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్! గంభీర్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా సుందర్ బౌలింగ్‌లోనే నిష్క్రమించగా, యూసుఫ్ పఠాన్ (4) నిరాశ పరిచాడు. అతను ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో కోల్‌కతా 55 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్‌హోమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మనీశ్ పాండే (32 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో పాండే వరుసగా మూడు ఫోర్లు బాదగా, వరుసటి ఓవర్ వేసిన తాహిర్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బ్యాట్ ఝళిపించడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటింది. ఉనాద్కట్, సుందర్ చెరో 2 వికెట్లు తీశారు. -
బెంగళూరు కథ కంచికే!
► ఏడో ఓటమితో ప్లేఆఫ్ ఆశలు ఆవిరి ► 61 పరుగులతో రైజింగ్ పూణే గెలుపు ► తాహిర్ ,ఫెర్గూసన్ సూపర్ బౌలింగ్ జట్టులో చెప్పుకుంటూ పోతే హిట్టర్లే... కానీ ప్రత్యర్థితో ఆడుకుంటూ వెళితే పరాజయాలే అన్న చందంగా తయారైంది బెంగళూరు జట్టు పరిస్థితి. తీరు మారని విరాట్ సేన మరో పరాజయంతో ‘ప్లే ఆఫ్’కు దాదాపు దూరమైంది. ఆశల్లేవ్... అవకాశాల్లేవ్... మేం ప్లే–ఆఫ్ రేసులో లేం. ఇక మా దారులు మూసుకుపోయాయి. మా ఆటతీరు ఎంత ఘోరంగా ఉందో అందరూ చూశారు. ఇలాంటి చెత్త ప్రదర్శన కనబరిచాక ఇంకేం మాట్లాడతాను. ఇది స్వయంకృతాపరాధం. దీనికి సాకులు వెతకను. కానీ ఇది పెద్ద గుణపాఠమని మా వాళ్లందరికి చెబుతున్నా. ఇక మిగిలిన మ్యాచుల్ని ఆస్వాదించేందుకే ఆడతాం. –కోహ్లి, బెంగళూరు కెప్టెన్ పుణే: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మళ్లీ ఓడింది. లక్ష్యం కష్టసాధ్యం కాకపోయినా... ఒంటిచేత్తో గెలిపించే బ్యాట్స్‌మెన్ ఉన్నా... నిర్లక్ష్యం నిండా ఆవహిస్తే... ఆట ఆదమరిస్తే... పరాజయాలు మావెంటే! అన్నట్లు సాగింది బెంగళూరు ఇన్నింగ్స్. శనివారం రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఏడో పరాజయంతో ఐపీఎల్–10లో అందరికంటే ముందుగా నిష్క్రమించేందుకు అడుగులేస్తోంది. మొదట పుణే 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్టు కోల్పోయి 96 పరుగులే చేయగల్గింది. నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ తీసుకొని కేవలం ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పుణే జట్ట పేస్ బౌలర్ ఫెర్గూసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆకట్టుకున్న స్మిత్, తివారి... టాస్ నెగ్గిన బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్ రహానే (6) రూపంలో తొలిదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద అతను బద్రీ బౌలింగ్‌లో మిల్నేకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాత కెప్టెన్ స్మిత్, ఓపెనర్ రాహుల్ త్రిపాఠికి జతయ్యాడు. రెండో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ఇద్దరూ కుదురుకుంటున్న ఈ తరుణంలో త్రిపాఠి (28 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్)ని నేగి ఔట్ చేశాడు. దీంతో మనోజ్ తివారి క్రీజులోకి వచ్చాడు. స్మిత్, తివారిలు అడపాదడపా ఫోర్లతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించారు. సరిగ్గా మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించాక 108 స్కోరు వద్ద స్మిత్ (32 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్)ను స్టువర్ట్ బిన్నీ పెవిలియన్‌కు పంపాడు. తర్వాత వచ్చిన ధోని (17 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), తివారి (35 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించారు. బద్రీ, నేగి, స్టువర్ట్ బిన్నీ తలా ఒక వికెట్ తీశారు. ఒకే ఒక్కడు కోహ్లి! జట్టులోని పదకొండు మంది కలిసి 96 పరుగులు చేస్తే... నాయకుడు మినహా సహచరులందరిదీ సింగిల్ డిజిటే! ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి (48 బంతుల్లో 55; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా... అవతలి వైపు నుంచి కనీస సహకారం లోపించింది. దీంతో జట్టు పరువు నిలిపే మూడంకెల స్కోరైనా సాధించలేకపోయింది. కోహ్లి తర్వాత రెండో అత్యధిక స్కోరు అరవింద్ చేసిన 8 (నాటౌట్) పరుగులే! చెత్త షాట్లతో హెడ్ (2), డివిలియర్స్ (3), కేదార్ జాదవ్ (7), సచిన్ బేబి (2), స్టువర్ట్ బిన్నీ (1) బ్యాట్లెత్తేశారు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ బెంగళూరు లక్ష్యం వైపు కనీసం చూడలేకపోయింది. పుణే బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 3, ఫెర్గూసన్ 2 వికెట్లు తీశారు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) మిల్నే (బి) బద్రీ 6; త్రిపాఠి (సి) జాదవ్ (బి) నేగి 37; స్మిత్ (సి) మిల్నే (బి) బిన్నీ 45; తివారి నాటౌట్ 44; ధోని నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–18, 2–58, 3–108. బౌలింగ్: మిల్నే 4–0–35–0, బద్రీ 4–0–31–1, అరవింద్ 4–0–30–0, చహల్ 2–0–25–0, నేగి 4–0–18–1, బిన్నీ 2–0–17–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: హెడ్ (బి) ఉనాద్కట్ 2; కోహ్లి (సి) సబ్–మయాంక్ (బి) క్రిస్టియాన్ 55; డివిలియర్స్ (సి) తివారి (బి) ఫెర్గూసన్ 3; జాదవ్ రనౌట్ 7; సచిన్ బేబి (సి) స్మిత్ (బి) సుందర్ 2; స్టువర్ట్ బిన్నీ (సి) సుందర్ (బి) ఫెర్గూసన్ 1; నేగి (సి) క్రిస్టియాన్ (బి) తాహిర్ 3; మిల్నే (సి) స్మిత్ (బి) తాహిర్ 5; బద్రీ (బి) తాహిర్ 2; అరవింద్ నాటౌట్ 8; చహల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 96. వికెట్ల పతనం: 1–11, 2–32, 3–44, 4–47, 5–48, 6–61, 7–71, 8–82, 9–84. బౌలింగ్: దీపక్ 2–0–18–0, ఉనాద్కట్ 4–0–19–1, ఫెర్గూసన్ 4–1–7–2, క్రిస్టియాన్ 4–0–25–1, తాహిర్ 4–0–18–3, సుందర్ 2–0–7–1. -
ముంబైపై ‘రైజింగ్’ పుణే
-
ముంబైపై ‘రైజింగ్’ పుణే
►చివరి ఓవర్లో స్మిత్ సేన ►ఉత్కంఠ విజయం ►రాణించిన బౌలర్లు ►రోహిత్ శర్మ పోరాటం వృథా వరుసగా ఆరు విజయాలతో భీకర ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ జోరుకు బ్రేక్ పడింది. ప్రత్యర్థి ఎవరైనా... ఎలాంటి లక్ష్యమైనా అవలీలగా సాధిస్తూ వస్తున్న రోహిత్ సేన రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను మాత్రం అధిగమించ లేకపోతోంది. తక్కువ స్కోరు అయినా పుణే బౌలర్లు చివరికంటా పోరాడి జట్టుకు చక్కటి విజయాన్ని అందించగలిగారు. లీగ్‌లో ఇప్పటిదాకా ముంబైకి ఎదురైన రెండు పరాజయాలూ పుణే చేతుల్లోనే కావడం విశేషం. అటు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రోహిత్ అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై: ఐపీఎల్ పదో సీజన్లో ముంబై ఇండియన్స్‌కు మరోసారి రైజింగ్ పుణే సూపర్ జెయింట్ అడ్డుకట్ట వేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పుణే మూడు పరుగుల తేడాతో నెగ్గింది. ఈ జట్టుకిది వరుసగా మూడో విజయం. ముంబై విజయం కోసం కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రహానే (32 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పార్థివ్ (27 బంతుల్లో 33; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్టోక్స్, ఉనాద్కట్లకు రెండేసి వికెట్లు దక్కాయి. స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. శుభారంభం అందినా: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణేకు ఓపెనర్లు రహానే, రాహుల్ త్రిపాఠి శుభారంభం అందించారు. తొలి ఓవర్లోనే సిక్స్ బాదిన రహానేకు తోడు త్రిపాఠి కూడా వేగంగా ఆడడంతో పవర్‌ప్లేలో జట్టు 48 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్లో రహానే రెండు ఫోర్లు, త్రిపాఠి ఓ ఫోర్ కొట్టడంతో 14 పరుగులు వచ్చాయి. అయితే తన వరుస రెండు ఓవర్లలో కరణ్ శర్మ వీరిద్దరిని పెవిలియన్‌కు చేర్చడంతో స్కోరులో వేగం తగ్గింది. మొదట రహానేను రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేయగా తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత త్రిపాఠి పనిపట్టాడు. అయితే మరుసటి ఓవర్లోనే హర్భజన్ కెప్టెన్ స్మిత్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో పాటు టి20ల్లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా పుణే ఇన్నింగ్స్‌లో మెరుపులు లేకపోగా స్టోక్స్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు), ధోని (7) వరుస ఓవర్లలో అవుటయ్యారు. ఆఖర్లో మనోజ్ తివారి (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) చెలరేగడంతో జట్టు ఓ మాదిరి స్కోరైనా చేయగలిగింది. రోహిత్ హవా: తొలి ఓవర్లో మూడు పరుగులే వచ్చినా ఆ తర్వాతి రెండు ఓవర్లలో బట్లర్ రెండు ఫోర్లు.. పార్థివ్ పటేల్ మూడు ఫోర్లు బాది జోరు కనబరిచారు. అయితే ఐదో ఓవర్లో స్టోక్స్.. బట్లర్‌ను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే నితీశ్ రాణా (3), పార్థివ్ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో పుణే పైచేయి సాధించింది. కానీ కెప్టెన్ రోహిత్ జట్టు విజయం కోసం అద్భుతంగా పోరాడాడు. 14వ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన తను 33 బంతుల్లో ఈ సీజన్లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అయితే చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సిన దశలో హార్దిక్ (11 బంతుల్లో 13; 2 ఫోర్లు) తొలి బంతికే వెనుదిరిగాడు. రెండో బంతిని రోహిత్ సిక్సర్‌గా మలిచినా నాలుగో బంతికి ఉనాద్కట్ రిటర్న్ క్యాచ్ తీసుకోవడంతో ముంబై పరాజయం ఖాయమైంది. ఐపీఎల్లో నేడు బెంగళూరు & హైదరాబాద్ వేదిక: బెంగళూరు, రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ధోని ధమాకా...
► రైజింగ్ పుణేను గెలిపించిన ‘మిస్టర్ కూల్’ ► 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్ ► సన్‌రైజర్స్‌కు మూడో పరాజయం ఆహా.. ఎన్నాళ్లైంది ధోని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ చూసి.. జట్టులో ఉన్నాడన్న మాటే కానీ అతను గతంలో మాదిరి ధనాధన్ ఆటను ప్రదర్శించడమే గగనమైపోయింది. అటు అభిమానులు కూడా దాదాపుగా అతడి బ్యాటింగ్ విన్యాసాన్ని పట్టించుకోవడమే మానేశారు. అయితే 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో ‘మిస్టర్ కూల్’ ధోని బ్యాట్ ఒక్కసారిగా గర్జించింది. అంచనాలకు అందని విధంగా బౌండరీల వర్షం కురిపిస్తూ ఒక్కసారిగా సమీకరణాలు మార్చేశాడు. దీంతో మ్యాచ్ రైజింగ్ పుణే సూపర్ జెయింట్ వైపు తిరిగింది. ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచి విజయం అందించడంతో పాటు తానెప్పటికీ ‘సూపర్ ఫినిషర్’ అని ధోని నిరూపించుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ బయటి వేదికపై హ్యాట్రిక్ పరాజయం పాలైంది. ఆఖరి ఓవర్లలో బౌలర్లు తడబడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పుణే: బయటి వేదికల్లోనూ సత్తా నిరూపించుకోవాలనుకున్న డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ భంగపడింది. ఎంఎస్ ధోని (34 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వీర బాదుడుకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఆఖరి బంతికి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి పుణే నాలుగో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసీఏ) మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఉనాద్కట్, తాహిర్, క్రిస్టియాన్లకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (41 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... మనోజ్ తివారి (8 బంతుల్లో 17 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం ధోనికి దక్కింది. సన్‌రైజర్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను బెంగళూరులో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. చివర్లో దూకుడు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో నత్తనడకలా సాగింది. ఆరో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో 45 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొమ్మిదో ఓవర్లో ఓపెనర్ శిఖర్ ధావన్ (29 బంతుల్లో 30; 5 ఫోర్లు) అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇది ఈ సీజన్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. 12వ ఓవర్లో హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) తొలి సిక్స్ బాదినా... ఆ తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. అటు వార్నర్ నెమ్మదిగా ఆడటంతో జట్టు స్కోరు వంద పరుగులు చేరేందుకు 15 ఓవర్లు ఆడాల్సి వచ్చింది. 17వ ఓవర్లో వార్నర్‌ను ఉనాద్కట్ బౌల్డ్ చేయగా హెన్రిక్స్, దీపక్ హుడా చివర్లో ధాటిగా ఆడటంతో స్కోరు పెరిగింది. 19వ ఓవర్లో చెరో సిక్స్ బాదగా చివరి ఓవర్లో హెన్రిక్స్ వరుసగా రెండు ఫోర్లు, హుడా మరో ఫోర్ కొట్టడంతో జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరు లభించింది. వీరిద్దరి జోరుతో చివరి నాలుగు ఓవర్లలో జట్టు 54 పరుగులు సాధించగలిగింది. అలాగే నాలుగో వికెట్‌కు ఈ జోడి మధ్య అజేయంగా 47 పరుగులు జత చేరాయి. చెలరేగిన ధోని... భారీ లక్ష్యం కాకపోయినా నాలుగో ఓవర్లోనే పుణే జట్టు ఓపెనర్ రహానే (2) వికెట్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ స్మిత్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు)తో కలిసి రాహుల్ త్రిపాఠి బ్యాట్ ఝుళిపించాడు. సిరాజ్ బౌలింగ్‌లో వరుసగా 4,6తో చెలరేగగా ఆ తర్వాత ఐదో ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో మరింత జోరు కనబరిచాడు. 32 బంతుల్లో టి20ల్లో త్రిపాఠి తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అటు పదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు సంధించిన స్మిత్‌ను మరుసటి ఓవర్లో రషీద్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు లేని పరుగు కోసం ప్రయత్నించిన త్రిపాఠిని రషీద్ నేరుగా వికెట్లకు త్రో విసిరి రనౌట్ చేయడంతో పుణేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అటు స్టోక్స్ (10) మరోసారి నిరాశపరిచాడు. ఈ దశలో అప్పటి వరకు నిదానంగా ఆడుతున్న ధోని ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. చివరి 18 బంతుల్లో 47 పరుగులు కావాల్సిన దశలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 18వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అతను భువీ వేసిన 19వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 29 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా హైడ్రామా నెలకొంది. తొలి బంతిని మనోజ్ తివారి ఫోర్‌గా మలిచాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి ధోని, నాలుగో బంతికి తివారి ఒక్కో సింగిల్ తీశారు. ఐదో బంతి ఆడిన ధోని రెండు పరుగులు సాధించాడు. దాంతో రైజింగ్ పుణే విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతిని ధోని ఎక్స్ట్రా కవర్ దిశగా బౌండరీ దాటించి పుణేకు సూపర్ ఫినిష్ ఇచ్చి విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (బి) ఉనాద్కట్ 43; శిఖర్ ధావన్ (సి) త్రిపాఠి (బి) తాహిర్ 30; విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూ (బి) క్రిస్టియాన్ 21; హెన్రిక్స్ నాటౌట్ 55; దీపక్ హుడా నాటౌట్ 19; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–55, 2–84, 3–129. బౌలింగ్: ఉనాద్కట్ 4–0–41–1; వాషింగ్టన్ సుందర్ 3–0–19–0; స్టోక్స్ 2–0–19–0; శార్దుల్ ఠాకూర్ 4–0–50–0; క్రిస్టియాన్ 4–0–20–1; తాహిర్ 3–0–23–1. రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) కౌల్ (బి) బిపుల్ శర్మ 2; రాహుల్ త్రిపాఠి (రనౌట్) 59; స్మిత్ (బి) రషీద్ 27; ధోని నాటౌట్ 61; స్టోక్స్ (సి) సబ్–శంకర్ (బి) భువనేశ్వర్ 10; మనోజ్ తివారి నాటౌట్ 17; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–15, 2–87, 3–98, 4–121. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–39–1; బిపుల్ శర్మ 4–0–30–1; సిరాజ్ 4–0–42–0; సిద్ధార్థ్ కౌల్ 3–0–45–0; రషీద్ ఖాన్ 4–0–17–1; హెన్రిక్స్ 1–0–4–0. -
కోహ్లి తీవ్ర అసంతృప్తి
బెంగళూరు: సొంత మైదానంలో ఓడిపోవడం పట్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో ఆదివారం చినస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో తమ టీమ్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోవడం శోచనీయమని వాపోయాడు. ఇలా ఆడితే విజయానికి తాము అర్హులం కాదని కుండబద్దలు కొట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ... ‘ఈ ఉద్వేగాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియడం లేదు. ఇలా ఆడితే విజయానికి మేము అర్హులం కాదు. నిజాయితీగా చెప్పాలంటే గత మ్యాచ్ చాలా బాగా ఆడాం. కానీ ఈరోజు మ్యాచ్ లో బాగా ఆడలేకపోయాం. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. మేము నిలకడగా, బాగా ఆడాల్సిన అవసరముంది. పుణె టీమ్ మాకంటే బాగా ఆడి గెలిచింద’ని అన్నాడు. డెత్ ఓవర్లలో తమ బౌలర్లు ఎక్కువగా పరుగులు ఇవ్వడాన్ని అతడు తప్పుబట్టాడు. ఆర్సీబీ బౌలర్లు మరింత మెరుడుపడాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. గతేడాది బాగా ఆడామని ప్రతిసారి అదేవిధంగా ఆడడం సాధ్యంకాదన్నాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీని పుణె 27 పరుగుల తేడాతో ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా మ్యాచ్‌లో గెలవడం విశేషం కాగా... చిన్నస్వామిలాంటి పరుగుల స్టేడియంలో హోమ్ టీమ్ బెంగళూరును ఓడించడం మరో విశేషం. -
పుణే ‘రైజింగ్’ విక్టరీ
-
పుణే ‘రైజింగ్’ విక్టరీ
బెంగళూరుపై ఘనవిజయం బెంగళూరు: ఐపీఎల్లో తొలుత బ్యాటింగ్ చేసిన తొమ్మిదిసార్లు పుణేకు పరాజయమే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం తక్కువ స్కోరు చేసి కూడా మ్యాచ్‌లో గెలవడం విశేషం కాగా... చిన్నస్వామిలాంటి పరుగుల స్టేడియంలో హోమ్ టీమ్ బెంగళూరును ఓడించడం మరో విశేషం. స్టోక్స్ (3/18), శార్దుల్ ఠాకూర్ (3/35)ల సూపర్ బౌలింగ్‌తో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ మురిసింది. ‘హ్యాట్రిక్’ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను 27 పరుగుల తేడాతో కంగుతినిపించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి ఓడింది. పుణేకు రహానే (25 బంతుల్లో 30; 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. అయితే తర్వాత వచ్చిన స్మిత్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గానే ఆడినా... స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో మనోజ్ తివారి (11 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు ఇన్నింగ్స్ చప్పగా సాగింది. మన్దీప్ (0) డకౌట్ కాగా... కోహ్లి (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (29 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏకంగా 11 ఓవర్ల పాటు బౌండరీ కొట్టలేకపోవడం గమనార్హం. ఐపీఎల్లో నేడు ►ఢిల్లీ & కోల్‌కతా వేదిక: న్యూఢిల్లీ, సా.గం. 4.00 నుంచి ►హైదరాబాద్ & పంజాబ్ వేదిక: హైదరాబాద్, రాత్రి .గం. 8.00 నుంచి ► సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెంచరీ వీరుడికి వీరతాళ్లు!
ఐపీఎల్ పదో సీజన్లో తొలి సెంచరీతో వీరవిహారం చేసిన యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు సంజూను సీనియర్ క్రికెటర్లు ఘనంగా కొనియాడారు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన బ్రాండన్ మెక్కల్లమ్ సంజూను ప్రశంసలతో ఆకాశానికెత్తాడు. ’సంజూ క్రికెట్ ఆడుతుంటే చూడటం నాకు ఇష్టం. అతనిది అద్భుతమైన ప్రతిభ’ అని మెక్కల్లమ్ ట్వీట్ చేశాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన మెక్కల్లమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలిలా చెలరేగి.. 73 బంతుల్లో 158 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే తొలి సెంచరీగా ఈ తుఫాన్ ఇన్నింగ్స్ మిగిలిపోయింది. ఇక తాజా పుణె మ్యాచ్‌లో 62 బంతుల్లో శతకం (102) కొట్టిన 22 ఏళ్ల సంజూ ఐపీఎల్లో అతి పిన్నవయస్సులో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2009లో మనీష్ పాండే 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వీరోచితమైన ఆటతీరు ప్రదర్శించిన సంజూపై బ్రాండన్ మెక్కల్లమ్తోపాటు టాప్ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్, కామెంటేటర్ హర్షభోగ్లే తదితరులు ప్రశంసలతో ముంతెత్తారు. సంజూ గొప్పగా ఆడాడని, అతని ఆడుతుండటం చూసి చాలా ఆనందం కలిగిందని కొనియాడారు. I love watching Sanju Samson play cricket! Hes some talent! — Brendon McCullum (@Bazmccullum) 11 April 2017 Sanju's indifferent year just took a big UU turn. Special Innings. #IPL2017 #RPSvDD — Ashwin Ravichandran (@ashwinravi99) 11 April 2017 -
రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం
-
సాహో సామ్సన్
-
సాహో సామ్సన్
⇒ 63 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 102 ⇒ క్రిస్ మోరిస్ మెరుపులు ⇒ రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఘనవిజయం తొలి మ్యాచ్‌లో దాదాపు విజయం అంచుల దాకా చేరి నిరాశ పడినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ ‘డేర్‌డెవిల్స్’ ఆట చూపింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్ చాలా రోజుల తర్వాత అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ తొమ్మిది బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు 200 పరుగుల మార్కును దాటించేలా చేశాడు. అటు జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాల బౌలింగ్ ధాటికి రహానే నేతృత్వంలో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 108 పరుగులకే కుప్పకూలి ఘోరంగా ఓడింది. పుణే: ఐపీఎల్ పదో సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (డీడీ) జట్టు దమ్మున్న ఆటను ప్రదర్శించింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 102; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీకి తోడు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ (9 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడవ్వడంతో డీడీ విజయాల బోణీ చేసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై 97 పరుగుల తేడాతో ఢిల్లీ నెగ్గింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. రిషభ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు), బిల్లింగ్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. దీపక్ చహర్, తాహిర్, జంపాలకు ఒక్కో వికెట్ దక్కింది. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణే జట్టును ఢిల్లీ బౌలర్లు దారుణంగా దెబ్బతీయడంతో 16.1 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్మిత్ కడుపునొప్పితో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. మయాంక్ చేసిన 20 పరుగులే పుణే ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. జహీర్, స్పిన్నర్ మిశ్రాలకు మూడేసి, కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. సామ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సామ్సన్ శతకం... తమ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు పరుగులే చేసిన ఢిల్లీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆదిత్య తారే పరుగులేమీ చేయకుండానే దీపక్ చహర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత డీడీ ఇన్నింగ్స్‌ను మరో ఓపెనర్ బిల్లింగ్స్, సంజూ సామ్సన్ పట్టాలెక్కించారు. వరుసగా రెండు ఫోర్లతో పరుగుల ఖాతా తెరిచిన సామ్సన్ మూడో ఓవర్లోనే వరుసగా రెండు ఫోర్లు బాది జోరును ప్రదర్శించాడు. అటు బిల్లింగ్స్ కూడా తన బ్యాట్‌కు పనిచెబుతూ ఆరో ఓవర్లో మూడు ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లేలో జట్టు 62 పరుగులు సాధించింది. కానీ మరోసారి ఇమ్రాన్ తాహిర్ తన మేజిక్ ప్రదర్శించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని విడదీశాడు. బిల్లింగ్స్ (17 బంతుల్లో 24; 4 ఫోర్లు)ను బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సామ్సన్‌కు రిషభ్ పంత్ (22 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో పరుగుల వేగం తగ్గలేదు. 12వ ఓవర్లో ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ను పంత్ సాధించాడు. అయితే మరో నాలుగు ఓవర్ల అనంతరం పంత్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 41 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన సామ్సన్ ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాట్‌ను ఝుళిపించాడు. 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు సాధించాడు. ఆ తర్వాత మరో భారీ సిక్సర్‌తో 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి... మరుసటి బంతికే జంపా బౌలింగ్‌లో సామ్సన్ బౌల్డ్ అయ్యాడు. అతను కేవలం 20 బంతుల్లోనే చివరి 52 పరుగులను సాధించడం విశేషం. దీనికి తోడు మోరిస్ వచ్చీ రాగానే బౌండరీల వర్షంతో పరుగుల వరద పారించాడు. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దాడి చేయడంతో 23 పరుగులు వచ్చాయి. సామ్సన్, మోరిస్ ధాటికి ఢిల్లీ జట్టు చివరి 4 ఓవర్లలో 76 పరుగులు రాబట్టింది. వికెట్లు టపటపా... లక్ష్యం భారీగా ఉండడంతో వేగంగా పరుగులు తీసే క్రమంలో పుణే జట్టు పూర్తిగా తడబడింది. ఢిల్లీ బౌలర్ల జోరుకు మూడో ఓవర్ నుంచే ప్రారంభమైన వికెట్ల పతనం ఏదశలోనూ ఆగలేదు. కెప్టెన్ అజింక్య రహానే (9 బంతుల్లో 10), మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (5 బంతుల్లో 10; 2 ఫోర్లు), డు ప్లెసిస్ (7 బంతుల్లో 8; 1 ఫోర్), బెన్ స్టోక్స్ (2) ఆరు ఓవర్ల వ్యవధిలోనే వెనుదిరగడంతో జట్టు 54 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓ భారీ సిక్సర్‌తో అలరించిన ధోని (14 బంతుల్లో 11; 1 సిక్స్) కూడా కొద్దిసేపటికే వెనుదిరిగి నిరాశపరిచాడు. అటు రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో పాటు మిగతా వికెట్లు కూడా త్వరగానే పడడంతో పుణేకు భారీ ఓటమి ఎదురైంది. ►1 ఐపీఎల్ టోర్నీలో ఓ జట్టు క్యాచ్‌ల ద్వారానే ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. ►5 ఐదేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్‌లో 200 కంటే ఎక్కువ పరుగులు చేసింది. -
ధోనీకి పుణె ఓనర్లకు అస్సలు పడటం లేదా?
పుణే: భారత్ క్రికెట్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ. అతని నాయకత్వంలో టీమిండియా అనేక చిరస్మరణీయ విజయాలను సాధించింది. ఒక గొప్ప క్రికెటర్‌గా ధోనీని, అతని వ్యక్తిత్వాన్ని అభిమానులు ఆరాధిస్తారు. కానీ టీమిండియా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. ఐపీఎల్‌లోనూ సారథ్య బాధ్యతలు కోల్పోయి.. ఇప్పుడు ఓ సాధారణ క్రికెటర్‌గా ఈ టోర్నీలో ఆడుతున్న ధోనీకి అవమానాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ధోనిని కెప్టెన్సీ నుంచి తొలగించిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ (ఆర్పీఎస్) జట్టు యాజమాన్యం.. అతనిపై విమర్శలతో ట్విట్టర్లో దుమారం రేపుతోంది. రైజింగ్ పుణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఇప్పటికే ధోనీపై ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయినా వెనుకకు తగ్గని హర్ష్ తాజాగా మరోసారి మరోసారి ధోనీపై విమర్శలు గుప్పించారు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పుణె విజయం సాధించడంతో జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ప్రశంసలు గుప్పించిన హర్ష్.. అంతటితో ఆగకుండా ధోనితో పోలిక తెచ్చారు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్. అతడిని కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం’ అని హర్ష్ ట్వీట్ చేశారు. ఆయన దురుసు విమర్శలపై ట్విట్టర్లో తీవ్ర దుమారం రేగింది. ఆయనపై ధోనీ అభిమానులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పుణె జట్టు తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చేతిలో ఓడిపోవడంతో హర్ష్ గోయెంకా మరోసారి ధోనీని టార్గెట్ చేశారు. పుణె ఆటగాళ్ల స్ట్రైక్ రేట్స్‌తో కూడిన స్క్రీన్ షాట్లను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో ఆర్పీఎస్ బ్యాటింగ్ స్టాటిస్టిక్స్ ఇవి.. మనోజ్ తివారి, రహానే, క్రిస్టియన్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ను సాధించారు’ అని కామెంట్ చేశారు. ఈ లిస్ట్‌లో 73.91 స్ట్రైక్ రేటుతో ధోనీ నాలుగోస్థానంలో ఉండగా.. ఒకే మ్యాచ్ ఆడి 17 పరుగులు చేసిన క్రిస్టియన్ 212.50 స్ట్రైక్ రేటుతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ ట్వీట్ ద్వారా గడిచిన రెండు మ్యాచ్‌లలో ధోనీ సరిగ్గా ఆడలేదనే విషయాన్ని పరోక్షంగా హర్ష్ గోయెంకా విమర్శించడంపై మరోసారి నెటిజన్లు మండిపడ్డారు. ధోనీని ఇలా బాహాటంగా విమర్శించడమేమిటని ఆయన అభిమానులు తప్పుబడుతున్నారు. మొత్తానికి పుణె జట్టు యాజమాన్యం తీరు చూస్తుంటే.. ధోనీకి వారికి అస్సలు పడటం లేదని, అందుకే అయినదానికీ, కానిదానికీ ఇలా విమర్శలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. #RPS batting statistics until now - Manoj Tiwari, Rahane , Christian have the best strike rates. pic.twitter.com/JKya3lxHKC — Harsh Goenka (@hvgoenka) 8 April 2017 -
పంజాబ్ కింగ్స్ బోణీ
-
పంజాబ్ కింగ్స్ బోణీ
► రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై విజయం ► రాణించిన మ్యాక్స్‌వెల్, మిల్లర్ ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు బోణీ చేసింది. కీలక సమయంలో కొత్త కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా రాణించారు. దాంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. లీగ్‌లో ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే అన్నింటిలోనూ పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, మనోజ్ తివారి (23 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆమ్లా (27 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదుకున్న స్టోక్స్, తివారి: పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో పుణే బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. తొలి ఓవర్లోనే మయాంక్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో రహానే (15 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్‌ను వోహ్రా వదిలేయగా... అదే ఓవర్లో అతను వరుసగా 6,4 బాది స్కోరులో వేగం తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో కెప్టెన్ స్మిత్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ తన తొలి ఓవర్లోనే రహానే వికెట్ తీసి పంజాబ్ జట్టులో సంతోషం నింపాడు. మరో ఓవర్ వ్యవధిలో స్మిత్ వికెట్‌ను స్టొయినిస్ తీయడంతో పుణే 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు ధోని (5) కూడా విఫలం కావడంతో భారమంతా స్టోక్స్, తివారిలపై పడింది. వీరిద్దరి జోరుకు తోడు చివర్లో క్రిస్టియాన్ 4,4,6 బాదడంతో జట్టు మంచి స్కోరు సాధించగలిగింది. మ్యాక్స్‌వెల్ బాదుడు: లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది. క్రీజులో ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన వోహ్రా (9 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) మూడో ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఫోర్లతో జోరు చూపించిన సాహా (14; 3 ఫోర్లు)ను తాహిర్ తన తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో పంజాబ్ 56 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా పుణే బౌలర్లు కట్టడి చేయగలిగారు. దీంతో ఒత్తిడికి లోనైన అక్షర్, ఆమ్లా వరుస ఓవర్లలో వికెట్లను చేజార్చుకున్నారు. అయితే మ్యాక్స్‌వెల్, మిల్లర్ ధాటిగా ఆడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) స్టొయినిస్ (బి) నటరాజన్ 19; మయాంక్ అగర్వాల్ (బి) సందీప్ శర్మ 0; స్మిత్ (సి) వోహ్రా (బి) స్టొయినిస్ 26; స్టోక్స్ (సి అండ్ బి) అక్షర్ 50; ధోని (సి అండ్ బి) స్వప్నిల్ సింగ్ 5; మనోజ్ తివారి నాటౌట్ 40; క్రిస్టియాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 17; రజత్ భాటియా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–1, 2–36, 3–49, 4–71, 5–132, 6–162. బౌలింగ్: సందీప్ 4–0–33–2; మోహిత్ 4–0–34–0; అక్షర్ 4–0–27–1; నటరాజన్ 3–0–26–1; స్టొయినిస్ 3–0–28–1; స్వప్నిల్ సింగ్ 2–0–14–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) స్టోక్స్ (బి) చహర్ 28; వోహ్రా (సి) తివారి (బి) దిండా 14; సాహా (బి) తాహిర్ 14; అక్షర్ (సి అండ్ బి) తాహిర్ 24; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 44; మిల్లర్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–27, 2–49, 3–83, 4–85. బౌలింగ్: దిండా 3–0–26–1; క్రిస్టియాన్ 2–0–24–0; స్టోక్స్ 4–0–32–0; తాహిర్ 4–0–29–2; చహర్ 4–0–32–1; భాటియా 2–0–20–0. -
ధోనిపై గోయెంకా పరుష వ్యాఖ్యలు
విరుచుకుపడ్డ అభిమానులు పుణే: ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించినా రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టు యాజమాన్యం అతనిపై తమ అసంతృప్తిని దాచుకోలేకపోతున్నట్లుంది. టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా చేసిన తాజా వ్యాఖ్యలు దానిని నిరూపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్‌పై విజయం తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ప్రశంసలు కురిపించిన హర్ష్ అంతటితో ఆగకుండా ధోనితో పోలిక తెచ్చారు. ‘అడవికి రాజు ఎవరో అనేది స్మిత్ నిరూపించాడు. ధోనిని ప్రేక్షక పాత్రకే పరిమితం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్. అతడిని కెప్టెన్‌గా నియమించడం సరైన నిర్ణయం’ అని హర్ష్ ట్వీట్ చేశారు. కొద్దిసేపట్లోనే ఈ ట్వీట్ వైరల్ కాగా, అభిమానులు పెద్ద ఎత్తున గోయెంకాపై విరుచుకుపడ్డారు. అసలు బహిరంగంగా ధోనిని విమర్శించడం ఏమిటని వారంతా తిట్టి పోశారు. ‘ఆసీస్ ఆటగాళ్లతో పోల్చి ధోనిని అవమానిస్తున్నందుకు సిగ్గు పడాలి’... ‘ధోని వల్లే నీ జట్టును అభిమానిస్తున్నారనే విషయం మరచిపోవద్దు’... ‘స్మిత్ కోసమో, స్టోక్స్ కోసమో, దిండా కోసమో పుణే వాళ్లు మ్యాచ్‌లు చూడటం లేదు, అంతా వచ్చింది ధోని కోసమే’... ‘స్మిత్ బాగా ఆడి ఉండవచ్చు కానీ ఒక దిగ్గజాన్ని ఎలా గౌరవించాలో ముందు నేర్చుకో’... ఇలా అన్ని వైపుల నుంచి హర్ష్ గోయెంకాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దిగి వచ్చిన హర్‡్ష, తన మొదటి ట్వీట్‌ను తొలగించి ధోని స్టార్ అనే విషయాన్ని అంగీకరిస్తున్నానని, తనతో పాటు అందరికీ అతను హీరో అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. -
ధోనీకి మందలింపు
►అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే.. ►చర్చనీయాంశంగా మిస్టర్ కూల్ అప్పీల్ పుణె: సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా ధోనీకి మంచి పేరు ఉంది. వ్యూహాలను అమలు చేయడంలో, ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో దిట్ట అన్న పేరు ఉంది. తాను నాయకత్వం వహించిన మ్యాచ్‌ల్లో వూహించని నిర్ణయాలు తీసుకొని చాలాసార్లు ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా గురువారం ముంబయి ఇండియన్స్ జట్టుతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తలపడింది. తన ఐపీఎల్ కెరీర్లో ధోనీ తొలిసారి సారథిగా కాకుండా ఓ సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. ముంబయి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ తాను కెప్టెన్ కాదు అన్న సంగతి మరచిపోయి అతడు వ్యవహరించిన తీరు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అసలు ఏం జరిగింది? అంతర్జాతీయ క్రికెట్ల్లో ప్రస్తుతం టెస్టు, వన్డే ఫార్మాట్లో మాత్రమే ‘డీఆర్ఎస్’ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రం సమీక్ష కోరే పద్ధతి అందుబాటులో లేదు. ఐతే ముంబయి ఇండియన్స్ జట్టు 115/5 ఉన్న సమయంలో పుణె స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 15వ ఓవర్ వేయడానికి బంతి అందుకున్నాడు. ముంబయి బ్యాట్స్‌మన్ పొలార్డ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తాహిర్ వేసిన బంతి పొలార్డ్ ప్యాడ్లకు తాకడంతో అతడు ఔట్ కోసం అంపైర్‌ను అప్పీల్ కోరాడు. కీపింగ్ చేస్తున్న ధోని సైతం గట్టిగానే అప్పీల్ చేశాడు. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. ధోనీ వెంటనే సమీక్ష కోరాడు. ఐతే ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోయినప్పటికీ పరోక్షంగా అంపైర్ నిర్ణయాన్ని అసహనంతో వ్యంగ్యంగా సంజ్ఞ రూపంలో తెలియజేశాడు. ఈ పరిణామంతో తోటిఆటగాళ్లు, మ్యాచ్ చూస్తోన్న ప్రేక్షకులు విస్తుపోయారు. అదేంటి? ధోనీ ఇలా చేశాడు. ఎప్పుడూ నిలకడగా కనిపించే ధోనీ.. ఇలా నిరసన ప్రదర్శించడంపై చర్చానీయాంశమైంది. కేవలం అంపైర్ తమ నిర్ణయాన్ని వ్యతిరేకించాడన్న కారణంతో ఇలాంటి వ్యంగ్య సైగలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మహీకి.. మందలింపు చివరికి అనుకున్నదంతా అయింది. అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధోని వ్యవహరించడం ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే. అతని ప్రవర్తనా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉండటంతో లెవల్–1 నిబంధనల ప్రకారం అతన్ని తీవ్రంగా మందలించారు. నియమావళిలో లెవల్–1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్ రిఫరీ మనూ నాయర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధోనీ తాను కెప్టెన్ అన్న సంగతి మరిచి ఇలా చేశాడో.. కావాలనే చేశాడో అన్న విషయం అర్థం కావడం లేదు. సాధారణ జట్టు సభ్యుడిగా ధోనీకి ఇది తొలిమ్యాచ్ కావడం వల్ల.. పాత అలవాటు ప్రకారం అలా చేసి ఉంటాడని చాలామంది ధోనికి మద్దతుగా నిలుస్తున్నారు. -
నా అంచనాలు తలకిందులు: స్టీవ్ స్మిత్
పుణే: ఐపీఎల్-10లో భాగంగా నిన్న (గురువారం) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంపై పుణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఫామ్ అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే విధంగా ఉండాలి. అదే ఆటగాడి లక్షణం. అయితే దురదృష్టవశాత్తూ ఆట చివరివకూ వెళ్లడం నిరాశ కలిగించిందని’ చెప్పాడు. ముఖ్యంగా ఒత్తిడిలో ఉన్న సమయంలో సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిపించడంపై స్పందించిన స్మిత్.. పుణే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమని అభిప్రాయపడ్డాడు. బంతిని బాదడమే పనిగా పెట్టుకోవాలని, ఫామ్ అంటూ కూర్చుంటే అద్భుతాలు చేయలేమని జట్టుకు సూచించాడు. ‘ముంబై ఇండియన్స్ మా జట్టులో ఓ స్పిన్నర్ ను టార్గెట్ చేసుకుని ఎక్కువ రన్స్ చేసేందుకు చూస్తారని భావించాను. కానీ నా అంచనాలు తలకిందులయ్యాయి. పుణే పేస్ బౌలర్ అశోక్ దిండాను టార్గెట్ చేసుకుని చివరి ఓవర్ లో హార్ధిక్ పాండ్యా విధ్వంసం సృష్టించాడు. ఏకంగా ఆ ఓవర్ లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్ సహా మొత్తం 30 పరుగులు రాబట్టుకున్నారు. 150-160 పరుగులకే కట్టడి అవుతుందనుకున్న ముంబై ఏకంగా 184 పరుగులు చేయడాన్ని నమ్మలేకపోతున్నాను’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు. -
పుణే ‘సూపర్’
-
పుణే ‘సూపర్’
⇒ ముంబై ఇండియన్స్‌పై విజయం ⇒రహానే, స్మిత్ అర్ధ సెంచరీలు ⇒హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ వృథా గత సీజన్లో ఎదురైన పరాభవాన్ని మరచిపోయేందుకు సరి‘కొత్త’గా తయారైన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ తొలి మ్యాచ్‌లోనే జోరు చూపింది. ఆరంభంలో బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్పిన్నర్ తాహిర్, పేసర్ రజత్ భాటియా కట్టడి చేయగా.. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్, రహానే అదరగొట్టే ఆటతీరుతో జట్టును విజయం దిశగా నడిపించారు. పుణే: కొత్త కెప్టెన్ రాకతో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ ఆటతీరు కూడా మారింది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ సమష్టిగా రాణించిన జట్టు ఐపీఎల్ పదో సీజన్లో బోణీ కొట్టింది. చివరి ఓవర్లో 13 పరుగులు రావాల్సి ఉండగా తొలి మూడు బంతులు సింగిల్స్ రావడంతో ఉత్కంఠ నెలకొన్నా... మరో రెండు బంతులను కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సిక్సర్లుగా మలచడంతో పుణే గట్టెక్కింది. అజింక్యా రహానే (34 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుణే ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నితిష్ రాణా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడగా చివర్లో హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ 19.5 ఓవర్లలో మూడు వికెట్లకు 187 పరుగులు చేసింది. ఐపీఎల్లో అతి ఖరీదైన ఆటగాడిగా నిలిచిన స్టోక్స్ బౌలింగ్‌లో ఓ వికెట్ తీయగా బ్యాటింగ్‌లో 21 (14 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు మాత్రమే చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు స్మిత్‌కి దక్కింది. చివర్లో ధనాధన్: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 11 పరుగులు రాబట్టింది. అయితే దిండా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పార్థివ్ (14 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను థర్డ్ మ్యాన్‌లో ఉన్న రజత్ భాటియా జారవిడిచాడు. బెన్ స్టోక్స్ తను వేసిన తొలి ఓవర్లోనే బట్లర్ రెండు సిక్సర్లు బాది జోరు చూపాడు. ఇమ్రాన్ తాహిర్ వేసిన తొలి ఓవర్లోనే పార్థివ్‌ను బౌల్డ్ చేయడంతో తొలి వికెట్‌కు 25 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరో ఓవర్లో బట్లర్ మరోసారి విరుచుకుపడి వరుస బంతుల్లో 4,6 తో రెచ్చిపోయాడు. అయితే తాహిర్ తన రెండో ఓవర్ మూడు బంతుల్లో కెప్టెన్ రోహిత్ (3), ధాటిగా ఆడుతున్న బట్లర్ (19 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)ను అవుట్ చేయడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత రాణా, పొలార్డ్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) ముంబైని ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా 6,6,6,4,6 బాదడంతో జట్టు స్కోరు అమాంతం 154 పరుగుల నుంచి 184 పరుగులకు చేరింది. రహానే, స్మిత్ అదుర్స్: పుణే ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ నుంచి అజింక్యా రహానే తన విశ్వరూపాన్ని ప్రదర్శిచాడు. హార్ధిక్ వేసిన ఆ ఓవర్లో మూడు ఫోర్లు బాదగా మూడో ఓవర్లో వరుసగా 6,4తో చెలరేగాడు. కానీ మూడో ఓవర్లో మయాంక్ (6) వికెట్‌ను మెక్లీనగన్ తీశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ దశలో రహానేకు సహకారం అందించాడు. మెక్లీనగన్ మరుసటి ఓవర్లో స్మిత్ ఫోర్‌తో పాటు రహానే వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో పవర్‌ప్లేలో పుణే 59 పరుగులు చేసింది. 9వ ఓవర్లో రహానే బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సౌతీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రహానే సూపర్ ఇన్నింగ్స్ నితిష్ రాణా అద్భుత డైవ్ క్యాచ్‌తో ముగిసింది. అయితే అటు స్మిత్ జోరు మాత్రం ఆగలేదు. అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచాడు. 13వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన స్మిత్ చివరి బంతికి ఇచ్చిన క్యాచ్‌ను రాణా మిస్ చేసి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. 37 బంతుల్లో తను అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్లో ధోని (12 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ఇచ్చిన క్యాచ్‌ను సౌతీ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్లో స్మిత్ జోరుతో పుణే నెగ్గింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: పార్థివ్ (బి) తాహిర్ 19; బట్లర్ ఎల్బీడబ్లు్య (బి) తాహిర్ 38; రోహిత్ (బి) తాహిర్ 3; రాణా (సి) భాటియా (బి) జంపా 34; రాయుడు (సి అండ్ బి) భాటియా 10; కృనాల్ పాండ్యా (సి) ధోని (బి) భాటియా 3; పొలార్డ్ (సి) మయాంక్ (బి) స్టోక్స్ 27; హార్దిక్ పాండ్యా నాటౌట్ 35; సౌతీ రనౌట్ 7; మెక్లీనగన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం (20 ఓవర్లలో 8వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–45, 2–61, 3–62, 4–92, 5–107, 6–125, 7–146, 8–183 బౌలింగ్: దిండా 4–0–57–0 ; దీపక్ చహర్ 2–0–21–0; స్టోక్స్ 4–0–36–1; తాహిర్ 4–0–28–3; జంపా 3–0–26–1; భాటియా 3–0–14–2 రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) రాణా (బి) సౌతీ 60; మయాంక్ అగర్వాల్ (సి) రోహిత్ శర్మ (బి) మెక్లీనగన్ 6; స్మిత్ నాటౌట్ 84; స్టోక్స్ (సి) సౌతీ (బి) హార్దిక్ పాండ్యా 21; ధోని నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 4; (19.5 ఓవర్లలో 3 వికెట్లకు) 187 వికెట్ల పతనం: 1–35, 2–93, 3–143 బౌలింగ్: సౌతీ 4–0–34–1, హార్దిక్ పాండ్యా 4–0–36–1; మెక్లీనగన్ 4–0–36–1; బుమ్రా 4–0–29–0; కృనాల్ పాండ్యా 2–0–21–0, పొలార్డ్ 1.5–0–30–0 ►ఐపీఎల్లో నేటి మ్యాచ్ గుజరాత్ లయన్స్ & కోల్‌కతా నైట్ రైడర్స్ ►వేదిక: రాజ్‌కోట్; రాత్రి. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆ జాబితాలో నేనున్నానో లేదో తెలీదు
⇒కోహ్లి వ్యాఖ్యలపై స్టీవ్ స్మిత్ ⇒పుణే జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరణ న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పిన ఇద్దరు ‘శత్రువుల’ జాబితాలో తాను ఉన్నదీ.. లేనిదీ తెలీదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఆసీస్ ఆటగాళ్లతో ఇక నుంచి స్నేహం ఉండదని చివరి టెస్టు ముగిశాక కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తను వివరణ ఇస్తూ ఇద్దరి గురించే ఆ వ్యాఖ్య చేసినట్టు చెప్పాడు. ఐపీఎల్–10లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ కెప్టెన్‌గా ఎంపికైన స్మిత్ గురువారం టీమ్ జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నాడు. ఇందులో పుణే జట్టు సభ్యులైన అజింక్య రహానేతో పాటు ఇటీవలే జట్టులో చేరిన బెన్ స్టోక్స్ కూడా పాల్గొన్నాడు. ‘ఆ ఇద్దరు ఎవరు అనేది కోహ్లి తేల్చాల్సిన విషయం. నాకైతే అందులో ఉన్నానో లేదో తెలీదు. నా అభిప్రాయం ప్రకారం టెస్టు సిరీస్ ముగిసింది. భారత్ మాకన్నా మెరుగ్గా ఆడింది. ఇప్పుడు పుణే సూపర్ జెయింట్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టాను’ అని స్మిత్ స్పష్టం చేశాడు. ధోనితో విభేదాల్లేవు: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో తనకెలాంటి విభేదాలు లేవని పుణే తాజా కెప్టెన్ స్మిత్ తేల్చి చెప్పాడు. ఇప్పటికే తామిద్దరం సందేశాలు పంపుకున్నామని, తనకు మద్దతుగా ఉన్నాడని తెలిపాడు. గత సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే నెగ్గిన పుణే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో పదో సీజన్ కోసం జట్టు యాజమాన్యం ధోనిని తప్పించి స్మిత్‌ను కెప్టెన్‌గా చేసింది. ‘వివిధ దేశాల నుంచి అద్భుత ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇది నాకు అనుకూలంగా ఉంటుందే తప్ప అడ్డంకి కాబోదు. అయితే లీగ్‌లో ఎక్కువ మంది అభిప్రాయాలను తీసుకోను. ఇది నా సొంత నిర్ణయాన్ని దెబ్బతీస్తుంది’ అని స్మిత్ చెప్పాడు. బీరు పార్టీకి వెళ్లలేదు: రహానే ధర్మశాల టెస్టు ముగిశాక ఆసీస్ జట్టు తనను బీరు పార్టీకి రమ్మని పిలిచినా వెళ్లలేదని ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే తెలిపాడు. ‘మా డ్రెస్సింగ్ రూమ్‌లో మేం సంబరాల్లో మునిగి ఉన్నాం. నేనక్కడే బిజీగా ఉన్నాను. సుదీర్ఘ సీజన్ తర్వాత మేం చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇక నేను ప్రశాంతంగా ఉండడంతోనే నా ఉత్తమ ఆట బయటకు వస్తుంది. కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. అతడికి అదే బలం. ఇప్పుడు ఐపీఎల్‌పైనే నా దృష్టి ఉంది’ అని రహానే అన్నాడు.