
పుణే ‘రైజింగ్’ విక్టరీ
బెంగళూరుపై ఘనవిజయం
బెంగళూరు: ఐపీఎల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తొమ్మిదిసార్లు పుణేకు పరాజయమే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం తక్కువ స్కోరు చేసి కూడా మ్యాచ్‌లో గెలవడం విశేషం కాగా... చిన్నస్వామిలాంటి పరుగుల స్టేడియంలో హోమ్ టీమ్ బెంగళూరును ఓడించడం మరో విశేషం. స్టోక్స్ (3/18), శార్దుల్ ఠాకూర్ (3/35)ల సూపర్ బౌలింగ్‌తో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ మురిసింది. ‘హ్యాట్రిక్’ పరాజయాల పరంపరకు ముగింపు పలికింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను 27 పరుగుల తేడాతో కంగుతినిపించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి ఓడింది.
పుణేకు రహానే (25 బంతుల్లో 30; 5 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. అయితే తర్వాత వచ్చిన స్మిత్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధోని (25 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గానే ఆడినా... స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగం తగ్గింది. చివర్లో మనోజ్ తివారి (11 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. అనంతరం బెంగళూరు ఇన్నింగ్స్ చప్పగా సాగింది. మన్‌దీప్ (0) డకౌట్ కాగా... కోహ్లి (19 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ (29 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలింగ్‌కు తలొగ్గారు. బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఏకంగా 11 ఓవర్ల పాటు బౌండరీ కొట్టలేకపోవడం గమనార్హం.
ఐపీఎల్‌లో నేడు
►ఢిల్లీ & కోల్‌కతా
వేదిక: న్యూఢిల్లీ, సా.గం. 4.00 నుంచి
►హైదరాబాద్ & పంజాబ్
వేదిక: హైదరాబాద్, రాత్రి .గం. 8.00 నుంచి
► సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం