ధ్రువ్ జురెల్.. ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో మారు మ్రోగుతున్న పేరు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్బుత ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో జురెల్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే మరో ఎంఎస్ ధోని దొరికాడంటూ దృవ్‌ను కొనియాడాడు.
కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ విరోచిత పోరాటం కనబరిచాడు. టీమిండియా 307 పరుగుల మెరుగైన స్కోర్ చేయడంలో జురెల్ ముఖ్య పాత్ర పోషించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 149 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 90 పరుగులు చేశాడు.
అయితే దురదృష్టవ శాత్తూ జురెల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో జురెల్‌ను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసించాడు. జురెల్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయని సెహ్వాగ్ కొనియాడు. అయితే ధ్రువ్ ఇన్నింగ్స్‌కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని, తీవ్ర అన్యాయం జరిగిందని వీరూ ఆరోపించాడు.
"ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును అదుకున్నాడు. కానీ మీడియాలో ధ్రువ్ ఇన్నింగ్స్‌కు అంత హైప్ దక్కలేదు. కనీసం ఆ చర్చే లేదు. ఏదేమైనప్పటికీ చాలా బాగా ఆడావు. ధ్రువ్‌కు శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో సెహ్వాగ్ రాసుకొచ్చాడు. కాగా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవున్ సర్ మీరు చెప్పిందే నిజమే అంటూ కామెట్లు చేస్తున్నారు. ఆ తర్వాత మొదటి పోస్ట్‌కు వివరణ ఇస్తూ సెహ్వాగ్ మరో ట్వీట్ చేశాడు.
"ఎవరినీ కించపరచాలి లేదా అవమానించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆటగాళ్ల ప్రదర్శనపై సమానమైన హైప్ ఉండాలి. ఈ మ్యాచ్‌లో ఆకాష్ దీప్ వంటి డెబ్యూ బౌలర్ సంచలన ప్రదర్శన చేశాడు. కానీ అతడికి కూడా అంత ఆదరణ దక్కలేదు. ధ్రువ్ విషయంలో కూడా ఇదే జరిగిందంటూ ట్వీట్(ఎక్స్) చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment