IND vs ENG 4th Test: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..? | India vs England 4th Test Day 3 Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs ENG 4th Test: ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?

Published Sun, Feb 25 2024 9:33 AM | Last Updated on Sun, Feb 25 2024 4:59 PM

India vs England 4th Test Day 3 Live Updates And Highlights - Sakshi

India vs England 4th Test Day 3 Live Updates:

ముగిసిన మూడో రోజు ఆట.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..?
భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్ట్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగలు చేసింది. రోహిత్‌ శర్మ (24), యశస్వి జైస్వాల్‌ (16) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ లక్ష్యానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది.

అంతకుముందు అశ్విన్‌ (5/51), కుల్దీప్‌ (4/22) ధాటికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. జడేజా ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్‌ (17), డకెట్‌ (15), రూట్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్‌ 0, స్టోక్స్‌ 4, హార్ట్లీ 7, రాబిన్సన్‌ 0, ఆండర్సన్‌ 0 పరుగులకే ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌ కలుపుకుని ఇంగ్లండ్‌ టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌
ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్‌ ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. కుల్దీప్‌ 4 వికెట్లతో రాణించగా.. జడేజా ఓ వికెట్‌ పడగొట్టాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే (60), బెయిర్‌స్టో (30) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. టీమిండియా లక్ష్యం 192 పరుగులు.

ఎనిమిదో వి​కెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
133 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మరో (ఎనిమిది) వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్‌ (0) ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. బెన్‌ ఫోక్స్‌కు జతగా షోయబ్‌ బషీర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
133 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి టామ్ హార్ట్లీ  (7) ఔటయ్యాడు. బెన్‌ ఫోక్స్‌కు జతగా ఓలీ రాబిన్సన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
120 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మరో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో (30) ఔటయ్యాడు. టామ్‌ హార్ట్లీ, బెన్‌ ఫోక్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
120 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ (4) క్లీన్‌ బౌల్డయ్యాడు. జానీ బెయిర్‌స్టోకు (30) జతగా బెన్‌ ఫోక్స్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
జాక్‌ క్రాలే రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 60 పరుగులు చేసిన క్రాలే.. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ వచ్చాడు. 29 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 112/4.

ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ డౌన్‌..
జో రూట్‌ రూపంలో ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రూట్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 17 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 66/3

16 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 64/2
ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ తిరిగి కోలుకునే ప్రయత్నం చేస్తోంది. 16 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ తమ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో జాక్‌ క్రాలే(38), రూట్‌(11) పరుగులతో ఉన్నారు.

అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌​కు ఆదిలోనే  బిగ్‌ షాక్‌ తగిలింది. ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను అశ్విన్‌ దెబ్బ తీశాడు. 5 ఓవర్‌ వేసిన అశ్విన్‌.. వరుస బంతుల్లో బెన్‌ డకెట్‌(15), పోప్‌(0) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్లకు ఇంగ్లండ్‌ స్కోర్‌: 19/2. క్రీజులో జాక్‌ క్రాలే, జో రూట్‌ ఉన్నారు.

భారత్‌ ఆలౌట్‌..
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. అదనంగా 88 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. 

భారత బ్యాటర్లలో దృవ్‌ జురల్‌ అద్బుతమైన పోరాట పటిమను కనబరిచాడు. తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్‌ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్‌.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు.

అతడితో పాటు జైశ్వాల్‌(73), కుల్దీప్‌ యాదవ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు టామ్‌ హార్ట్‌లీ 3 వికెట్లు, జేమ్స్‌ ఆండర్సన్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

తొమ్మిదో వికెట్‌ డౌన్‌..
టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఆకాష్‌ దీప్‌.. బషీర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. బషీర్ ఆకాష్‌ వికెట్‌తో తన తొలి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 102 ఓవర్లు ముగిసే సరికి భారత స్కోర్‌: 303/9

దృవ్‌ జురల్‌ పోరాటం..
దృవ్‌ జురల్‌ తన బ్యాటింగ్‌లో స్పీడ్‌ను పెంచాడు. 98 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. క్రీజులో దృవ్‌ జురల్‌(78)తో పాటు ఆకాష్‌ దీప్‌(3) పరుగులతో ఉన్నారు.

దృవ్‌ హాఫ్‌ సెంచరీ..
టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దృవ్‌ జురల్‌ తన కెరీర్‌లో తొలి హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు. 89 ఓవర్లకు భారత స్కోర్‌: 256/8. క్రీజులో దృవ్‌ జురల్‌(50), ఆకాష్‌ దీప్‌ ఉన్నారు.

ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌
టీమిండియా ఎట్టకేలకు ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 76 పరుగుల భాగస్వామ్యాన్ని ఆండర్సన్‌ బ్రేక్‌ చేశాడు. 28 పరుగులు చేసిన కుల్దీప్‌ యాదవ్‌.. జేమ్స్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 89 ఓవర్లకు భారత స్కోర్‌: 253/8. క్రీజులో దృవ్‌ జురల్‌(49), ఆకాష్‌ దీప్‌ ఉన్నారు.

82 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 240/7
82 ఓవర్లు ముగిసే సరికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రీజులో దృవ్‌ జురల్‌(39), కుల్దీప్‌ యాదవ్‌(25) పరుగులతో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న దృవ్‌ జురల్‌
కుల్దీప్‌ యాదవ్‌(19), దృవ్‌ జురల్‌ నిలకడగా ఆడుతున్నారు. 75 ఓవర్ల ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.

రాంఛీ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లండ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను షోయబ్‌ బషీర్‌ ప్రారంభించాడు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో దృవ్‌ జురల్‌(30), కుల్దీప్‌ యాదవ్‌(17) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134  పరుగులు వెనకబడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement