India vs England 4th Test Day 4 Live Updates:
భారత్ ఘన విజయం.. సిరీస్ సొంతం
రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించింది. టీమిండియా విజయంలో శుబ్‌మన్ గిల్(52 నాటౌట్), ధ్రువ్ జురెల్(39 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. తద్వారా మరో మ్యాచ్ మిగిలూండగానే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది.
నిలకడగా ఆడుతున్న జురెల్, గిల్..
రాంఛీ టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. భారత విజయానికి ఇంకా 23 పరుగులు కావాలి. క్రీజులో ధ్రువ్ జురెల్(31), శుబ్‌మన్ గిల్(37) పరుగులతో క్రీజులో ఉన్నారు.
విజయానికి చేరువలో భారత్..
టీమిండియా విజయానికి ఇంకా 37 పరుగులు కావాలి. స్కోరు: 155/5 (50).
గిల్, జురెల్ నిలబడితే
టీమిండియా ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు రసవత్తరంగా మారింది. షోయబ్ బషీర్ స్పిన్ మాయాజాలంతో కష్టాల్లో పడ్డ భారత జట్టును ధ్రువ్ జురెల్, శుబ్‌మన్ గిల్ గట్టెక్కించే పనిలో పడ్డారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ.. 49వ ఓవర్ ముగిసే సరికి గిల్ 30, జురెల్ 21 పరుగులు చేశారు.
బషీర్ స్పిన్ మ్యాజిక్.. కష్టాల్లో టీమిండియా
లంచ్ విరామం తర్వాత టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 39 ఓవర్ వేసిన బషీర్ వరుస బంతుల్లో జడేజా, సర్ఫరాజ్ ఖాన్‌ను ఔట్ చేశాడు. భారత విజయానికి ఇంకా 71 పరుగులు కావాలి. క్రీజులో గిల్(19), ధ్రువ్ జురెల్(1) ఉన్నారు. 39 ఓవర్లకు భారత స్కోర్: 121/5
లంచ్ బ్రేక్‌కు టీమిండియా స్కోర్: 118/3
లంచ్ బ్రేక్‌కు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో శుబ్‌మన్ గిల్(18), జడేజా(3) పరుగులతో ఉన్నారు.
టీమిండియా మూడో వికెట్ డౌన్..
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. రజిత్ పాటిదార్ మరోసారి నిరాశ పరిచాడు. బషీర్ బౌలింగ్‌లో పోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులో రవీంద్ర జడేజా, శుబ్‌మన్ గిల్(7) పరుగుతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 92 పరుగులు కావాలి.
రెండో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ ఔట్..
రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. భారత విజయానికి ఇంకా 93 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ ఫిప్టీ..
రాంఛీ టెస్టులో విజయం దిశంగా భారత్ అడుగులు వేస్తోంది. 22 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకా 99 పరుగులు కావాలి. క్రీజులో ప్రస్తుతం రోహిత్ శర్మ(52), శుబ్‌మన్ గిల్(4) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన భారత్.. జైశ్వాల్ ఔట్
192 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 37 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. రూట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత స్కోర్: 85/1. టీమిండియా విజయానికి ఇంకా 107 పరుగులు కావాలి.
విజయం దిశగా భారత్..
14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(42), యశస్వీ జైశ్వాల్(25) ఉన్నారు. భారత విజయానికి ఇంకా 125 పరుగులు కావాలి. రాంఛీ వేదికగా ఇంగ్లండ్- భారత్ మధ్య నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది.
అయితే ఈ మ్యాచ్‌లో భారత పట్టు బిగించింది. టీమిండియా సిరీస్ విజయానికి ఇంకా ఇంకా 152 పరుగుల దూరంలో నిలిచింది. 192 పరుగుల లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(24), యశస్వీ జైశ్వాల్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment