రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. భారత విజయానికి ఇంకా 74 పరుగులు కావాలి. నాలుగో రోజు లంచ్ విరామానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(18),రవీంద్ర జడేజా(3) పరుగులతో ఉన్నారు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
జైశ్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే మంచి టచ్‌లో కన్పించిన హిట్‌మ్యాన్ ఊహించని విధంగా ఔటయ్యాడు. ఈజీగా తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్ ఫుట్‌కు వచ్చి ఆడిన రోహిత్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ క్యాచ్ బంతిని అందుకున్న వెంటనే స్టంప్స్‌ను పడగొట్టాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకున్నట్లు రిప్లేలో తేలడంతో క్యాచ్ ఔట్‌గా ప్రకటించారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తాకకపోయినా రోహిత్ స్టంపౌట్‌గా పెవిలియన్‌కు చేరేవాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓవరాల్‌గా 81 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: వారెవ్వా.. 41 ఏళ్ల వయస్సులో కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
— Sitaraman (@Sitaraman112971) February 26, 2024
Comments
Please login to add a commentAdd a comment