రజత్ పాటిదార్ (PC: BCCI/JIO Cinema)
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో కూడా పూర్తిగా నిరాశపరిచి మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
కాగా ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రజత్ పాటిదార్.. దేశవాళీ క్రికెట్‌లో సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ తరపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పాటిదార్ ఎట్టకేలకు 2023లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ముప్పై ఏళ్ల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇప్పటి వరకు ఆడింది ఒకే ఒక్క వన్డే. సాధించిన స్కోరు 22. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి జట్టుకు దూరంగా ఉండటంతో అతడి స్థానంలో రజత్ పాటిదార్‌కు అవకాశం వచ్చింది.
ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా టీమిండియా టెస్టు క్యాప్ అందుకున్న పాటిదార్.. ఆ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 32, 9 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులోనూ ఆడే అవకాశం దక్కించుకున్న అతడు రాజ్‌కోట్(5,0)లో పూర్తిగా విఫలమయ్యాడు.
అయినప్పటికీ రాంచి టెస్టులో కూడా పాటిదార్‌కు ఛాన్స్ ఇచ్చింది మేనేజ్‌మెంట్. అయితే, ఇక్కడా పాత కథనే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేయగలిగిన పాటిదార్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. తప్పక రాణించాల్సిన మ్యాచ్‌లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి పాటిదార్ ఈ మేరకు విఫలమయ్యాడు.
ఈ మూడు మ్యాచ్‌లలోనూ రజత్ పాటిదార్ స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకుని వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతడిపై విమర్శలు వస్తున్నాయి. ‘‘ఆర్సీబీలో పులి.. టీమిండియాలో పిల్లి’’ అన్న చందంగా పాటిదార్ ఆట తీరు ఉందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
వరుస అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇకనైనా పాటిదార్‌ను తప్పించి అతడి స్థానంలో అర్హుడైన ఆటగాడిని జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.
Againnnnn😭😭
— unapologetic_analyst (@arham412003) February 26, 2024
Patidar is promoting his edits more than anyone🤣pic.twitter.com/DY3x5d0yVO
Thank You Rajat Patidar 🦆
— sarcastic (@Sarcastic_broo) February 26, 2024
You will not be remembered #RajatPatidar #INDvENG pic.twitter.com/JNHOyYFkMF
Comments
Please login to add a commentAdd a comment