రాంచి : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టుకు ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటికే పేవలమైన ఆటతీరుతో రెండు టెస్టుల్లోనూ పరాజయాన్ని మూటగట్టుకున్న సఫారీ జట్టుకు టాస్ కూడా కలిసి రావడం లేదు. రెండు టెస్టుల్లోనూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా భారీ విజయాలు సొంతం చేసుకుంది. మరోవైపు డుప్లెసిస్ వరుసగా ఆరుసార్లు టాస్ ఓడి పోయాడు. దీంతో టాస్ గెలిస్తే మూడో టెస్టులో బ్యాటింగ్ చేపడతామని డుప్లెసిస్ గురువారమే స్పష్టం చేశాడు. అయితే, ప్రోక్సీ కెప్టెన్‌గా సఫారీ జట్టులోని మరొక ఆటగాడు టాస్ చెబుతాడని వెల్లడించాడు.
కానీ, అతని ఆశలు ఆవిరయ్యాయి. మూడో టెస్టులో భాగంగా కోహ్లియే మరోసారి టాస్ నెగ్గాడు. ప్రోక్సీ కెప్టెన్‌గా వచ్చిన టెంబె బవుమా కూడా టాస్ విషయంలో తమ జట్టు అదృష్టాన్ని మార్చలేక పోయాడు. కోహ్లి టాస్ వేయగా.. బవుమా టేల్స్ ఎంచుకున్నాడు. దీంతో కాయిన్ కాస్తా హెడ్స్ పడటంతో టీమిండియా టాస్ గెలిచింది. ఇక అక్కడ నుంచి వెళ్లిపోతున్న బవుమా భుజం తట్టిన కోహ్లి ఓ చిరునవ్వు నవ్వాడు. కామెంటేటర్ మురళీ కార్తీక్‌తో మాట్లాడుతూ.. సౌతాఫ్రికా ఈసారైనా టాస్ గెలవాలనే ప్రయత్నం గుర్తుకు వచ్చి.. ‘హో మ్యాన్’ అంటూ కోహ్లి నవ్వు ఆపుకోలేక పోయాడు. టీమిండియా బ్యాటింగ్ చేపడుతున్నట్టు ప్రకటించాడు. ‘మరో మాట లేకుండా విరాట్ బ్యాటింగ్ ఎంచుకుంటాడు కదా..!’ అని బీసీసీఐ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది.
Virat Kohli called it a no-brainer to bat first at the Toss #TeamIndia #INDvSA @Paytm 🇮🇳🇮🇳 pic.twitter.com/3V4fKvcVWr
— BCCI (@BCCI) October 19, 2019
Comments
Please login to add a commentAdd a comment