స్వదేశంలో టీమిండియా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. అదే విధంగా ఉమ్రాన్ మాలిక్, ఆర్షదీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు.
ఇక ఈ సిరీస్ కోసం ప్రోటిస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకుంది. ఇరు జట్లు మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9 జరగనుంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన సీనియర్ త్రయం జట్టులో లేనప్పటికీ.. టీమిండియా గట్టి పోటీ ఇస్తుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా చెప్పాడు. ప్రోటీస్ కెప్టెన్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడాడు.
సీనియర్ ఆటగాళ్ళు లేని ఈ భారత జట్టుపై తన అభిప్రాయాలు గురించి ప్రశ్నించనప్పడు.. "నిజంగా భారత జట్టు కొత్త లూక్‌తో కన్పిస్తుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన చాలా మంది యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. అయితే మేము మాత్రం భారత్‌ను తేలికగా తీసుకోము. ఈ జట్టును భారత జూనియర్ జట్టుగా పరిగణించము. మేము ఎప్పటిలాగే పోటీతత్వంతోనే బరిలోకి దిగుతాము" అని బావుమా పేర్కొన్నాడు.
చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆలౌట్..!
Comments
Please login to add a commentAdd a comment