
South Africa vs India, 1st Test:
Update: టీమిండియాతో తొలి టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
1:00 PM: టాస్ ఆలస్యం
ఊహించినట్లుగానే సౌతాఫ్రికా- టీమిండియా తొలి టెస్టుకు వర్షం ఆటంకిగా మారింది. సెంచూరియన్‌లో వాన కారణంగా అవుట్ ఫీల్డ్ మొత్తంగా తడిగా మారింది. దీంతో టాస్ ఆలస్యం కానుందని నిర్వాహకులు వెల్లడించారు.
గత రెండురోజులుగా వర్షాలు
కాగా షెడ్యూల్ ప్రకారం భారత్- సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగాల్సి ఉంది. అయితే, మొదటి మ్యాచ్‌కు వేదికైన సెంచూరియన్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మంగళవారం(డిసెంబరు 26) నుంచి మొదలు కానున్న మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉందని స్థానిక వాతావరణ శాఖ నుంచి ముందుగానే హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఈసారైనా...?
తొలి రెండు రోజులు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్లుగానే.. సెంచూరియన్‌లో వర్షం కారణంగా సూపర్‌స్పోర్ట్ పార్క్ అవుట్ ఫీల్డ్ మొత్తం పచ్చిగా ఉండటంతో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది.
ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా వంటి టీమిండియా స్టార్లు ఈ సిరీస్‌తోనే మళ్లీ మైదానంలో దిగనున్నారు. ఇక సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే.
టీమిండియా- సౌతాఫ్రికా గత టెస్టు సిరీస్‌ల ఫలితాలు...
►1992 (4 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ సొంతం
►1996 (3 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 2–0తో సిరీస్ కైవసం
►2001 (2 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ హస్తగతం
►2006 (3 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 2–1తో సిరీస్ సొంతం
►2010 (3 టెస్టులు)
►ఫలితం: 1–1తో సిరీస్ ‘డ్రా’
►2013 (2 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 1–0తో సిరీస్ కైవసం
►2018 (3 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 2–1తో సిరీస్ సొంతం
►2021 (3 టెస్టులు)
►ఫలితం: దక్షిణాఫ్రికా 2–1తో సిరీస్ కైవసం.
చదవండి: AUS vs PAK: పాక్ ఆటగాళ్ల చర్యకు ఆసీస్ క్రికెటర్లు ఫిదా.. వీడియో వైరల్
📍Centurion
— BCCI (@BCCI) December 26, 2023
The Boxing Day Test is here!
Let's go #TeamIndia 💪#INDvSA pic.twitter.com/wj4P8lu1QC
Comments
Please login to add a commentAdd a comment