ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (PC: BCCI)
South Africa vs India, 1st Test: వన్డే ప్రపంచకప్-2023 తర్వాత టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా వీరిద్దరు మళ్లీ బ్యాట్ ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమి బాధను దిగమింగి సఫారీ గడ్డపై భారత్ జయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
వీడియో షేర్ చేసిన బీసీసీఐ
ఇందుకోసం నెట్స్‌లో చెమటోడుస్తున్నారు కెప్టెన్ రోహిత్, రన్‌మెషీన్ కోహ్లి. బలహీనతలు అధిగమించేలా అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరితో పాటు యువ బ్యాటర్లు శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ తదితరులు సైతం నెట్ సెషన్‌లో తీవ్రంగా శమ్రిస్తున్నారు.
సెంచూరియన్ వేదికగా బాక్సింగ్ డే(డిసెంబరు 26) నాటి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎక్స్‌లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
It is time for the Test series and Captain Rohit Sharma is READY! 💪🏾🙌🏽#TeamIndia | @ImRo45 | #SAvIND pic.twitter.com/EYwvGjuKGw
— BCCI (@BCCI) December 24, 2023
ముఖాముఖి రికార్డు.. ప్రొటిస్‌దే పైచేయి
టీమిండియా- సౌతాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 42 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సఫారీలు 17 సార్లు విజయం సాధించగా.. భారత్ 15 సార్లు గెలుపొందింది. 10 టెస్టులు డ్రాగా ముగిశాయి.
సఫారీ పిచ్‌లపై మనకు సాధ్యం కాలేదు
అయితే, సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న లోటు అలాగే ఉండిపోయింది. ఈ అపఖ్యాతి నుంచి జట్టుకు విముక్తి కలిగించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. కాగా ప్రొటిస్ గడ్డపై టీమిండియా ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడగా.. కేవలం నాలుగింట గెలిచింది. ఇక ఆతిథ్య సౌతాఫ్రికా 12 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. ఏడింటిలో ఫలితం తేలలేదు.
చదవండి: Ind vs SA: వాళ్లిద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. షమీ స్థానంలో అతడే!
Test Match Mode 🔛#TeamIndia batters are geared up for the Boxing Day Test 😎#SAvIND pic.twitter.com/Mvkvet6Ed9
— BCCI (@BCCI) December 25, 2023
Comments
Please login to add a commentAdd a comment