టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. భారత గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓలీ పోప్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అశ్విన్ ఇప్పటివరకు భారత్ గడ్డపై టెస్టుల్లో 351 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(350) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
చదవండి: IND vs ENG: పాపం దృవ్.. జస్ట్ సెంచరీ మిస్! అయినా హీరోనే
Comments
Please login to add a commentAdd a comment