ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి గుడ్‌బై చెప్పనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతమంది రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లనున్నాడని, మరి కొంతమంది ఢిల్లీ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడని చెప్పుకుంటూ వస్తున్నారు.
తాజాగా ఇదే విషయంపై మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగాలని ఓజా తెలిపాడు. కాగా హిట్‌మ్యాన్‌తో ఓజా మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో ఓజా.. రోహిత్‌లో కలిసి నాలుగేళ్ల పాటు ముంబై ప్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించారు.
"ముంబై ఇండియన్స్‌తో రోహిత్‌కు మంచి అనుబంధం ఉంది. ముంబై ఫ్రాంచైజీలో రోహిత్ చాలా కాలం నుంచి అంతర్భాగంగా ఉన్నాడు. వారికి ఐదు టైటల్స్‌ను అందించాడు. రోహిత్‌ని వదిలివేయడం వారికి సులభమో కాదో నాకు తెలియదు.
కానీ రోహిత్‌కి మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు రోహిత్ కూడా ముంబై ఫ్రాంచైజీని విడిచిపెట్టాలని అనుకోడు. ఒకవేళ అదే జరిగితే కఠిన నిర్ణయమనే చెప్పవచ్చు. నా వరకు అయితే ముంబై ఇండియన్స్‌లో రోహిత్ కొనసాగితేనే బెటర్.
అతడు ఈ స్థాయికి ఎదగడంలో ముంబై ఇండియన్స్ పాత్ర కూడా ఉంది. అందుకే అతడు ముంబై ఫ్రాంచైజీలోనే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇది ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్, కొన్ని సార్లు ఏదైనా జరగవచ్చు" అని ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓజా పేర్కొన్నాడు.
చదవండి: టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనున్న హార్దిక్ పాండ్యా ..?
Comments
Please login to add a commentAdd a comment