ముంబై: ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా విదేశీ టి20 లీగ్‌లలో ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అందుకు బీసీసీఐ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు ఈ హైదరాబాద్ క్రికెటర్ చెప్పాడు. ‘ప్రస్తుతానికి నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను. బీసీసీఐలో కూడా భాగంగా ఉన్నా. ఇకపై విదేశీ లీగ్‌లలో ఆడాలనేది నా ఆలోచన. అందుకే బోర్డు పెద్దల సలహా తీసుకోవాలని భావిస్తున్నా. అనుమతి లభిస్తే మాత్రం ఆడేందుకు సిద్ధం’ అని ఓజా వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడలేకపోవడం తన కెరీర్‌లో నిరాశకు గురి చేసిన అంశమని అతను విశ్లేషించాడు. ‘చకింగ్’ కారణంగానే తన కెరీర్ ఇబ్బందుల్లో పడిందని విషయాన్ని అతను అంగీకరించలేదు. ఆ వివాదం తనకు సమస్య కాలేదని, 22 రోజుల్లోనే బౌలింగ్ శైలిని సరిదిద్దుకొని మళ్లీ రంజీ బరిలోకి దిగిన విషయాన్ని ఓజా గుర్తు చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment