Foreign T20 leagues
-
ఫారెన్ లీగ్స్‌లో భారత క్రికెటర్లు..? బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..!
-
విదేశీ లీగ్‌లలో ఆడతా: ఓజా
ముంబై: ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా విదేశీ టి20 లీగ్‌లలో ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అందుకు బీసీసీఐ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు ఈ హైదరాబాద్ క్రికెటర్ చెప్పాడు. ‘ప్రస్తుతానికి నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను. బీసీసీఐలో కూడా భాగంగా ఉన్నా. ఇకపై విదేశీ లీగ్‌లలో ఆడాలనేది నా ఆలోచన. అందుకే బోర్డు పెద్దల సలహా తీసుకోవాలని భావిస్తున్నా. అనుమతి లభిస్తే మాత్రం ఆడేందుకు సిద్ధం’ అని ఓజా వ్యాఖ్యానించాడు. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడలేకపోవడం తన కెరీర్లో నిరాశకు గురి చేసిన అంశమని అతను విశ్లేషించాడు. ‘చకింగ్’ కారణంగానే తన కెరీర్ ఇబ్బందుల్లో పడిందని విషయాన్ని అతను అంగీకరించలేదు. ఆ వివాదం తనకు సమస్య కాలేదని, 22 రోజుల్లోనే బౌలింగ్ శైలిని సరిదిద్దుకొని మళ్లీ రంజీ బరిలోకి దిగిన విషయాన్ని ఓజా గుర్తు చేసుకున్నాడు. -
యూసుఫ్ పఠాన్ నిర్ణయంపై వెనక్కి
హాంకాంగ్ టి20 లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఉపసంహరణ ముంబై: విదేశీ టి20 లీగ్‌లలో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందే అవకాశం యూసుఫ్ పఠాన్ చేజారింది. మార్చి 8 నుంచి 12 వరకు హాంకాంగ్‌లో జరిగే టి20 లీగ్‌లో పాల్గొనేందుకు యూసుఫ్ పఠాన్‌కు గతవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అతనికి నిరభ్యంతర పత్రం కూడా జారీ చేసింది. దాంతో ఈ లీగ్‌లో కౌలూన్ కాంటోన్స్ జట్టు యూసుఫ్ పఠాన్‌తో ఒప్పందం చేసుకుంది. యూసుఫ్ పఠాన్‌కు పచ్చ జెండా ఊపిన తర్వాత భారత్‌కే చెందిన ఇతర క్రికెటర్లు కూడా హాంకాంగ్ టి20 లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐని కోరారు. ఒకేసారి చాలామంది క్రికెటర్లు ఇలా అనుమతి కోరడంతో పునరాలోచనలో పడిన బీసీసీఐ యూసుఫ్ పఠాన్‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అతనితోపాటు ఇతర క్రికెటర్లు కూడా విదేశీ టి20 లీగ్‌లలో ఆడొద్దని ఆదేశించింది. ఇటీవలే దినేశ్ కార్తీక్ కరీబియన్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి దరఖాస్తు చేసుకోగా దానిని తిరస్కరించింది. ఇప్పటివరకు భారత్ నుంచి ఏ క్రికెటర్ కూడా విదేశీ టి20 లీగ్‌లలో ఆడలేదు. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన మాత్రం ఇటీవలే ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ టి20 లీగ్‌లో ఆడినా... కొన్ని మ్యాచ్‌ల తర్వాత బీసీసీఐ వీరిద్దరినీ వెనక్కి పిలిచింది.