సంజూ.. నువ్వు పోస్ట్‌ పెయిడ్‌ సిమ్‌ అవ్వాలి! | IPL 2021: Samson To Become Postpaid Have To Perform Consistently, Ojha | Sakshi
Sakshi News home page

సంజూ.. నువ్వు పోస్ట్‌ పెయిడ్‌ సిమ్‌ అవ్వాలి!

Published Fri, Apr 16 2021 3:49 PM | Last Updated on Fri, Apr 16 2021 5:39 PM

IPL 2021: Samson To Become Postpaid Have To Perform Consistently, Ojha - Sakshi

సంజూ సామ్సన్‌(ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ:  ఒక మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం, ఆపై వెంటనే మళ్లీ నిరాశపరచడం ఇదే సంజూ సామ్సన్‌ విషయంలో మనం తరచు చూసేది.  గత కొంతకాలంగా ఇదే తరహా ప్రదర్శన కారణంగానే సంజూ నిలకడలేని ఆటగాడని విమర్శలు వస్తున్నాయి. భారత క్రికెట్‌ జట్టులో ఆరేళ్ల క్రితం చోటు దక్కించుకున్న సామ్సన్‌.. కానీ ఇప్పటివరకూ రెగ్యులర్‌ ఆటగాడు కాలేకపోయాడు సామ్సన్‌.  అతనికంటే ఎంతో వెనకాల వచ్చిన రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌లు భారత జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటే పోతే, సామ్సన్‌ మాత్రం అప్పడప్పుడు మాత్రమే టీమిండియా జట్టులోకి వస్తున్నాడు.

అక్కడ కూడా ఇదే తరహా ప్రదర్శన. ఆడితే పించ్‌ హిట్టర్‌ తరహాలో మోత మోగించడం, ఆపై వెంటనే సింగిల్‌  డిజిట్‌కే పరిమితం కావడం సంజూ విషయంలో జరుగుతూ వస్తోంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 119 పరుగులు సాధించిన సంజూ.. ఆపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇలా విఫలం కావడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా తనదైన శైలిలో విశ్లేషించాడు.  స్పోర్ట్స్‌ టుడేతో మాట్లాడిన ఓజా.. సంజూ సామ్సన్‌ ఇంకా ప్రీ పెయిడ్‌లోనే ఉన్నాడు. . పోస్ట్‌ పెయిడ్‌ కావాలి అంటూ చమత్కరించాడు.  

‘సంజూ సామ్సన్‌ 2015లో భారత క్రికెట్‌ జట్టులో అరంగేట్రం సరికి రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌లు లేరు. కానీ ఇప్పుడు భారత జట్టులో సంజూ లేడు. ఇందుకు కారణం అతనిలో నిలకడ లేకపోవడమే. సంజూ సామ్సన్‌ పోస్ట్‌ పెయిడ్‌ కావాలంటే నిలకడ అవసరం. యువ క్రికెటర్లకు నేను ఇదే చెబుతాను. నిలకడ ముఖ్యం’ అని చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టులో కీలక ఆటగాళ్లైన విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు పోస్ట్‌ పెయిడ్‌ ఆటగాళ్లని, వారు కొన్నాళ్లు బిల్లు కట్టకపోయినా వారికి నడుస్తుందన్నాడు.  కోహ్లి, రోహిత్‌లు ఒకవేళ విఫలమైనా వారికి ఇప్పట్లో నష్టమేమీ లేదని పోస్ట్‌ పెయిడ్‌తో పోల్చాడు ప్రజ్ఞాన్‌ ఓజా. 

ఇక్కడ చదవండి: ఢిల్లీ ఓటమి: పంత్‌ మిస్టేక్‌ వెరీ క్లియర్‌..!
ఐపీఎల్‌ 2021: ఆరుగురు భారత క్రికెటర్లు.. ఒక్కడే విదేశీ క్రికెటర్‌
‘అశ్విన్‌కు బౌలింగ్‌ ఎందుకు ఇవ్వలేదో అడుగుతా’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement